నిర్లక్ష్యపు నీడలో ప్రభుత్వ పాఠశాల
పాఠశాల ప్రాంగణంలో నిలిచిన వర్షపు నీరు
స్కూల్ ముందర సిసి రోడ్డు ఎత్తుగా వేసినందుకే నీరు ఆగినట్టు ఉంది అధికారుల నిర్లక్ష్యమా కాంట్రాక్టర్ లోపమా అవగాహన లేఖన..?
గద్వాల్ జిల్లా.. కేటీ దొడ్డి మండలం గంగన్ పల్లిగ్రామం లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పారిశుధ్యం మెరుగు పరచాలని,పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఉన్నతాధికారులు నెత్తి నోరు బాదుకున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అవి కనిపించడం లేదు.మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం కురిసిన వానలకు పాఠశాల ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయింది. విద్యార్ధినులు, ఉపాద్యాయులు కనీసం నడవడానికి రాణి పరిస్థితినీ చూస్తున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు