మండలంలోని ప్రధాన రహదారులను వెంటనే పూర్తి చేయాలి!బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ననుబోతు సైదులు

అడ్డగూడూరు 26 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ దవఖానలో ఆర్వో ప్లాంటు ఓపెనింగ్ కు వచ్చి తిరిగి వెళుతున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే మందుల సామేల్ కు మండల బిజెపి నాయకులు వినతి పత్రం అందజేశారు.అనంతరం తాసిల్దార్ శేషగిరిరావు కు వినతిపత్రం అందజేసిన మండల బిజెపి నాయకులు..వారు మాట్లాడుతూ..అడ్డగూడూరు మండలం జాతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండలంలో మానాయకుంట నుండి చౌళ్ళరామారం వరకు ఉన్న ప్రధాన రహదారి శంకుస్థాపనలకి పరిమితమైన నిర్మాణం నోచుకోవడం లేదు అదేవిధంగా చౌళ్ళరామారం నుండి జానకిపురం వరకు డబల్ రోడ్డు నిర్మాణం కూడా శంకుస్థాపనకి పరిమితమైంది మంగమ్మగూడెం,కొండంపేట అజీంపేట,వెల్దేవి,మానాయకుంట వరకు ఉన్న రోడ్లను గత 20 సంవత్సరాల నుండి మరమ్మతులు చేసే దిక్కు లేదు..అదే విధంగా ఆర్ అండ్ రోడ్ నుండి డి రేపోక స్టేజి కంచనపల్లి మట్టి రోడ్డు కనీసం మట్టి పోయడానికి కూడా దిక్కులేదు..అదే రోడ్డుపై కస్తూర్బా స్కూల్ కు వెళ్లడానికి అధికారులు,విద్యార్థులు,ప్రజా ప్రతినిధులు అటువైపు వెళ్లడానికి ఇబ్బందిగా ఉన్నది.బొడ్డుగూడెం నుండి అడ్డగూడూరు మండల కేంద్రానికి ఉన్న రోడ్డు గుంతలమామై అధ్వానంగా ఉన్నది. కావున స్థానిక ఎమ్మెల్యే స్థానిక జిల్లా మంత్రి ఉండి కూడా రోడ్డు నిర్మాణం నిధులు కేటాయించి పూర్తి చేయకపోవడం ఓట్లేసి గెలిపించిన స్థానిక ప్రజలు వాపోతున్నారు. అన్ని రోడ్లను పూర్తిగా బాగు చేయించాలని ప్రభుత్వాన్ని మండల పార్టీ బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ కూరాకుల వెంకటేశ్వర్లు,మండల పార్టీ అధ్యక్షుడు ననుబోతు సైదులు,కూరాకుల అరుణ జిల్లా కౌన్సిలర్ నెంబర్, లింగాల శ్యాంసుందర్ రెడ్డి సీనియర్ నాయకులు, సోమిరెడ్డి నర్సిరెడ్డి మండల కన్వీనర్, మేకల ఇమ్మానియేల్ మాజీ మండల అధ్యక్షుడు, కొత్తోజు నవీన్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి, లింగాల నరసింహ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి, దేశబోయిన నాగరాజు మండల పార్టీ ఉపాధ్యక్షులు, మరాటి నాగరాజు మండల కోశాధికారి, గూడ అవిలయ్య ఓ బి సి మండల అధ్యక్షుడు, బి ఏక స్వామి మండల యూత్ ఉపాధ్యక్షులు, గోలి సుమన్ బీజేవైఎం మండల అధ్యక్షుడు, సంజీవ బూతు అధ్యక్షులు మల్కాపురి వెంకటయ్య బూత్ అధ్యక్షుడు, తోట సరస్వతి మండల ఉపాధ్యక్షురాలు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.