భారీ మెజార్టీతో గెలుపు ఖాయం

Dec 9, 2025 - 06:04
 0  106
భారీ మెజార్టీతో గెలుపు ఖాయం

తిరుమలగిరి 09 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:

 తిరుమలగిరి మండలం మామిడాల బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సైదులు విస్తృతంగా ప్రచారంలో ముందుకు సాగుతూ గెలిచేది మా జెండానే మా పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు మొట్టమొదటిగా  హిమ్లా తండాలో భారీ ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలతో వారు మాట్లాడుతూ మా ప్రభుత్వంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వైకుంఠధామాలు గ్రామపంచాయతీలు సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు ఎన్నో పనులు చేశానని తెలిపారు, ప్రతి పేదోడికి వెన్నుదన్ను ఉండి నీడనిచ్చే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని ధీమా వ్యక్తంచేశారు. గతంలో నా సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అని చెప్పారు. ఇప్పుడు గెలిపిస్తే ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉంటూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, యాకూబ్ గ్రామ శాఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి