భారీగా సారా బెల్లం పట్టుకున్న ఎక్స్చేంజ్ సీఐ జయశ్రీ
కొత్తగూడెం సెప్టెంబర్ 7: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మేదర బస్తి ఏరియాలో శుక్రవారం సుమారు రాత్రి 8:30 కి విశ్వనీయ సమాచారం మేరకు పది లీటర్ల నాటుసారా, 70 కేజీల పట్టిక, 3740 కేజీల బెల్లం సుమారు దాని విలువ రెండు లక్షల 50 వేల రూపాయలు, టాటా బొలెరో వెహికల్ లో ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా రవాణా చేస్తుండగా కొత్తగూడెం ఎక్స్చేంజ్ సీఐ జయశ్రీ వారి సిబ్బంది వాహనాన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది.ఈ బెల్లాన్ని ఆంధ్రప్రదేశ్లోని తణుకు నుంచి కొత్తగూడెం తీసుకొని వచ్చారని నేరస్తులు తెలిపారు.షేక్ బాజీ తండ్రి పేరు మహమ్మద్, (25) అకిరా పల్లి గ్రామం ఏలూరు జిల్లాకి చెందిన వ్యక్తి అని తెలిపారు. సీఐ జయశ్రీ,, హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ కిరణ్ ,సత్యనారాయణ, సాయి పల్లవి,పాల్గొన్నారు.