బిసి హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన తహసిల్దార్

తిరుమలగిరి 17 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ ని అకస్మాత్తుగా తనిఖీ చేసిన తహసీల్దార్ హరి ప్రసాద్ ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ హాస్టల్ లోని వంటశాల, ముడిసరుకుల నాణ్యత, పరిశుభ్రత, బాత్రూమ్‌లు తదితర అంశాలను పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ జాన్ మొహమ్మద్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు