బిజెపి దగా పార్టీ నీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలి

May 1, 2024 - 20:52
 0  5
బిజెపి దగా పార్టీ నీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలి

నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరురఘువీర్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ తెలంగాణ మద్దతు

 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతబాబు  మాదిగ

మాదిగలను మోసం చేసిన బిజెపి పార్టీని ఈ లోక్సభ ఎన్నికల్లో ఓడించాలని నల్లగొండ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింత బాబు మాదిగ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పల్లెటి లక్ష్మణ్ మాదిగ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈనెల 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి మేడి పాపన్న నాయకత్వంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పారు. బిజెపి దగా కోరు పార్టీ అని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.  బిజెపి అధికారంలోకి వస్తే దళితులకు రక్షణ లేకుండా పోతుంది అన్నారు. మతోన్మాది పార్టీ బిజెపి దళిత మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు చేయడం మన చూస్తూనే ఉన్నామని చెప్పారు.  దేశంలో ఉన్న యువత ఆలోచించి పార్లమెంటు ఎన్నికలలో బిజెపిని ఓడించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించిన కెసిఆర్ మాదిగలకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. బిజెపి, బీ ఆర్ఎస్ రెండు ఒకటేనని, తెలంగాణలో కేసీఆర్ నియంత పాలనకి ఎలాగైతే స్వస్తి పలికారో కేంద్రంలో కూడా నరేంద్ర మోడీనీ ఓడించాలని పిలుపునిచ్చారు. పార్టీ వంద రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తామని పది సంవత్సరాలు  అధికారంలో ఉండి కూడా చేయక మాదిగలను మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మాదిగల పట్ల తన మాట నిలబెట్టుకుంటానని చెప్పారని వెల్లడించారు.  ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉన్న ఎమ్మార్పీఎస్ నాయకులు పాపన్న నాయకత్వంలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కనుకు జానయ్య మాదిగ, జిల్లా గౌరవ అధ్యక్షులు దుబ్బ రమేష్ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుడపురి పురి ఉపేందర్ మాదిగ , సూర్యాపేట మండల అధ్యక్షులు చింత సైదులు మాదిగ, దుబ్బ ప్రేమ్, మహేష్, వినయ్, నాగరాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333