బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తా :మందకృష్ణ మాదిగ
తిరుమలగిరి 28 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:
కోదాడకు చెందిన కర్ల రాజేష్ లాక ప్ డెత్ ఫై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రభుత్వ డిమాండ్ చేశారు మంగళవారం నాడు తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన ప్రసంగించారు రాజేష్ లాకప్ డెత్ పై రెండు నెలలుగా ఎమ్మార్పీఎస్ తో పాటు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు స్పందించి బాధ్యులైన ఎస్ఐ సురేష్ రెడ్డి డిఎస్పి శ్రీధర్ రెడ్డి తో పాటు అధికారులను సస్పెండ్ చేయడం, వారి పై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైనారని ఆయన అన్నారు ఈ విషయమై జిల్లా మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యే పద్మావతి పోలీసు అధికారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు రాష్ట్ర డిజిపి తో పాటు మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశామని అన్నారు, 2017 నుండి ఇప్పటివరకు 11వేల 666 జరిగిన లాకప్ డెత్ లో ఇప్పటివరకు ఏ ఒక్క పోలీసు అధికారి కూడా శిక్ష పడలేదని అన్నారు కానీ కర్ల రాజేష్ మృతిలో వాస్తవాలను వెలికి తీస్తే పోలీసు అధికారులకు శిక్ష పడే అవకాశం ఉందని అన్నారు ఇందుకోసమే రాజేష్ మృతిపై ప్రభుత్వం నేటి వరకు ఎలాంటి స్పందనలేదని పోలీస్ శాఖ కూడా ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదని చెప్పారు ఇందులో బాధ్యులైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి తో పాటు కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి లను ఉద్యోగం నుండి రిమూవ్ చేయాలని కోరారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని అడ్డగు డూరు మండలంలో జరిగిన మరియమ్మ లాకప్ డెత్ లో
ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేయడంతోనే అప్పటి ఎస్సై సస్పెండ్ అయ్యారని అని చెప్పారు అదే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు నేడు అధికార పక్షంలో ఉండి కర్ల రాజేష్ లాకప్ డెత్ ఫై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు, రాజేష్ మృతికి కారకులైన అయిన వారిని శిక్షించడంతోపాటు పోలీసుల విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయాలని కోరారు అలాగే త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు ఇందుకోసం అన్ని నియోజకవర్గాల వారీగా అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు, ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా నాయకులు కందుకూరి సోమన్న మాదిగ , వివిధ పార్టీల నాయకులు కొమ్మినేని సతీష్ కుమార్ వై దీన దయాల్ మేడ బోయిన యాదగిరి పేర్ల నాగయ్య కొత్తగట్టు మల్లయ్య కడెం లింగయ్య నలుగురి రమేష్ , ప్రజా సంఘాల నాయకులు రాం ప్రభు కందుకూరి ప్రవీణ్ దయా యాదవ్ వంగరి బ్రహ్మం చింతకింది మురళి దుస్తా రామ్మూర్తి భూక్య శీను నాయక్ పోలే బోయిన కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు