బాధితుని వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్

Jan 29, 2026 - 20:32
 0  2
బాధితుని వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ బాధితుని వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్ ఆత్మకూర్ ఎస్.... మండల పరిధిలోని పాత సూర్యాపేట గ్రామానికి చెందిన తండు మహేష్ కల్లుగీత కార్మికుడు, కల్లు గీసుకొని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా పాత సూర్యాపేట స్టేజి వద్ద వెనుకనుండి కొంత మంది వ్యక్తులు వచ్చి అతన్ని ఆపి పేరు అడిగి దాడి చేశారు. విషయం తెలుసుకున్న ఆత్మకూర్ ఎస్సై శ్రీకాంత్ గౌడ్ సిటిజన్ సెంట్రిక్ అప్రోచ్ సమాచారం మేరకు బాధితుడు సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా, అతని వద్దకు వెళ్లి బాదితుని నుండి దరఖాస్తు తీసుకొని అక్కడే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ బాదితునికి అందజేసినట్లు ఎస్ఐ బత్తిని శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.