ఎన్ హెచ్ ఆర్ సి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా చారకొండ బాబు

నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
నాగర్ కర్నూల్ : జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులుగా చారకొండ బాబును నియమస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఉత్తర్వులను జారీ చేసినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు శివవీర్ రెడ్డి ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాముల నారాయణ తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బలమైన లీగల్ ప్రొసీజర్ తో ఏర్పడిన జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) ని జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేయాలని వారు ఆదేశించారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన ఎన్ హెచ్ ఆర్ సి నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు చారగొండ బాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతలను నీతి నిజాయితీతో నిర్వహిస్తామని, తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు శివవీర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు గౌని నాగేశ్వర్ రెడ్డి, ఎండి సమీలకు కృతజ్ఞతలు తెలిపారు.