బహుజన సమాజ్ పార్టీలో 15 కుటుంబాలు చేరిక

Feb 22, 2025 - 18:09
Feb 22, 2025 - 18:56
 0  5
బహుజన సమాజ్ పార్టీలో 15 కుటుంబాలు చేరిక

నాయకుల కాలనీ గ్రామ ప్రజలకు పార్టీ నిరంతరం అండగా ఉంటుంది.....

బహుజన రాజ్యస్థాపణకై sc, st,bc,లు ఐక్యమవ్వాలి....

బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ తడికల శివకుమార్....

చ,ర్ల 22 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:-  చర్ల మండల పరిధిలోని నాయకుల కాలనీ గ్రామానికి చెందిన 15 కుటుంబాల ప్రజలు బహుజన్ సమాజ్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కొండా కౌశిక్ ఆధ్వర్యంలో శనివారం(bsp) బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పార్టీ జిల్లా ఇంచార్జ్ తడికల శివకుమార్ పార్టీ కండువా కప్పి వారిని సగర్వంగా పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీలోకి నాయకుల కాలనీ గ్రామస్తులు రావడం ఎంతో శుభ పరిణామం అని అంబేద్కర్ మిషనరీ లో భాగస్వామ్యం అవ్వడం అనేది ఈ గ్రామస్తుల చైతన్యానికి నిదర్శనం అని అన్నారు. పార్టీ నిరంతరం ఈ కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు. బహుజన రాజ్యాధికారానికి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఐక్యమవ్వాలని బహుజన సమాజ్ పార్టీ చేసే ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు కొండా చరణ్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్, నియోజకవర్గ కార్యదర్శి చల్లగుండ్ల సతీష్ చౌదరి, పార్టీ మండల ఉపాధ్యక్షులు చెన్నం మోహన్, పార్టీ మండల కార్యదర్శి నక్క సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.