ఫిట్నెస్ లేని బస్సులతో పరేషాన్
జోగులాంబ గద్వాల్ 15 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల ఫిట్నెస్ లేని బస్సులతో ప్రయాణికులు పరేషాన్ అవుతున్నారు. కాలం చెల్లిన బస్సులను ఆర్టీసీ అధికారులు లాభాల కోసం రోడ్లపైకి తీసుకొస్తున్నారు. బస్సులు ఊరు దాటకముందే ఆగిపోతుండడంతో ప్రయాణికులు పరేషాన్ లో పడుతున్నారు. శుక్రవారం గద్వాల ఆర్టీసీ బస్టాండ్ నుండి ఆయిజకు బయలుదేరిన బస్సు మేళ్లచెరువు చౌరస్తా దాట గానే ఆగిపోయింది. అందులో దాదాపు 60 నుంచి 70 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు అకస్మాత్తుగా ఆగిపోవడంతో ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ డిఎం, సీఐలకు ఫోన్ చేసి ప్రయాణికులు తమ గోడును వెల్లబోసుకున్నారు. అయినా ప్రయాణికులను పట్టించుకున్న పాపాన పోలేదు. బస్సు ఆగిన తర్వాత గద్వాల బస్టాండ్ నుండి అయిజ కు వెళ్లే బస్సులు కూడా కెపాసిటీకి మించి రావడంతో ప్రయాణికులను చూసి వచ్చిన బస్సులు ఆగకుండా వెళ్ళిపోయాయి.? దీంతో ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. ?ఆర్టీసీ అధికారులకు లాభార్జన మీద ఉన్న దృష్టి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలనే దృష్టి లేకపోవడం దురదృష్టకరమని ప్రయాణికులు వాపోయారు. ఆర్టీసీ అధికారులు ఇప్పటికైనా ఫిట్నెస్ కలిగిన బస్సులను నడపాలని ప్రయాణికులు కోరారు.