ప్రమాదవశాత్తు కర్నూలు వైపు గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి.
జోగులాంబ గద్వాల 24 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధిl- ఈరోజు తెల్లవారుజామున గద్వాల రైల్వే స్టేషన్ లోని 2-వ నెంబర్ కాంటీన్ లో వర్కర్ గా పని చేసే ఉత్తరప్రదేశ్ రాష్ట్రము రసులాబాద్ తహసిల్ పరిధిలోని జాట్ గ్రామానికి చెందిన శివ గుప్తా, వయసు 31 సంవత్సరాలు అనే యువకుడు కాంటీన్ వద్ద నుండి కొత్త హోసింగ్ బోర్డ్ కాలనీలో గల తన యజమాని ఇంటికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్ చివరన హౌసింగ్ బోర్డ్ కాలనీ పార్క్ వద్ద పట్టాలు దాటుచుండగా ప్రమాదవశాత్తు కర్నూల్ వైపు వెళ్లే గుర్తు తెలియని రైలుబండి ఢీ కొని తల పగిలి రెండు కాళ్ళు తెగి వేరు పడి అక్కడిక్కడే మరణించినాడు. మృతునికి ఇద్దరు తమ్ముళ్లు మరియు ఇద్దరు చెల్లెళ్ళు కలరు. కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించి మృతదేహన్ని గద్వాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ గదిలో భద్రపరచడం జరిగిందని G. రామకృష్ణ రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలియజేశారు.