ప్రభుత్వ పాఠశాలలకు త్వరలో గ్యాస్ కనెక్షన్లు

Jun 19, 2026 - 22:14
 0  1
ప్రభుత్వ పాఠశాలలకు త్వరలో గ్యాస్ కనెక్షన్లు

జోగులాంబ గద్వాల 19 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం (MDM) నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయుటకు గాను, *ఈరోజు మండల విద్యాశాఖ అధికారి, ఇటిక్యాల శ్రీ వెంకటేశ్వర్లు * ఇటిక్యాలలోని *Bhanu Indane Gas Agency ను సందర్శించారు.

ఈ సందర్భంగా ఇటిక్యాల మరియు ఎర్రవల్లి మండలాలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలల గ్యాస్ కనెక్షన్ దరఖాస్తులు, పాఠశాలల విద్యార్థుల సంఖ్య, అలాగే నెలకు అవసరమయ్యే గ్యాస్ సిలిండర్ల వివరాలను భాను ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులకు సమర్పించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రతి పాఠశాలకు అవసరమయ్యే సిలిండర్ల వివరాలను సమగ్రంగా అందజేయడం జరిగింది.

భాను ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు స్పందిస్తూ, అందిన వివరాలను పరిశీలించి సోమవారం నాటికి అన్ని  ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ కాజా పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333