ప్రభుత్వ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు 

Aug 23, 2025 - 18:36
Aug 23, 2025 - 18:45
 0  8

మార్కెట్ వ్యాల్యూ పెంచితే స్టాంప్ డ్యూటీ తగ్గించాలి.

 రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

 (సూర్యాపేట టౌన్, ఆగస్టు 23 ) :  రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కుడ కుడ లో ఆ సంఘం సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేసి మాట్లాడారు. ఎంతోమంది రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన నిరుద్యోగులు  గత రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల రేట్లు ప్రభుత్వం మూడు రేట్లు పెంచితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సామాన్య బిల్డర్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆపకపోతే రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేస్తామని చెప్పారు. చిన్న చిన్న ప్లాట్లు, భూములు అమ్ముకునే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. మార్కెట్ వ్యాల్యూ పెంచితే స్టాంప్ డ్యూటీ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎల్ఆర్ఎస్ కొరకు పదివేల రూపాయలు చెల్లించిన వారి విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్న వాటిని గుర్తించి నూతన భవనాలు నిర్మించి పూర్తిస్థాయిలో సిబ్బందిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ డౌన్ మూలంగా చలాన్లు ఫెయిల్ అవుతున్నాయని అన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ ఉపాధ్యక్షుడు మహంకాళి ప్రణీత్ కు జన్మదిన వేడుకల సందర్భంగా   శుభాకాంక్షలు  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు, జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలాహోదరుడు, దేవత కిషన్ నాయకు జిల్లా ప్రధాన కార్యదర్శి, వెన్న శ్రీనివాస్ రెడ్డి, రియల్ ఎస్టేట్ జిల్లా ఉపాధ్యక్షుడు, sk బాబా, బండారు రాజా, జిల్లా కోశాధికారి పాల సైదులు,షేర్ సుధాకర్ రెడ్డి పంతంగి శ్రీనివాస్ గౌడ్, పంతంగి దశరథ, మధిరాల సతీష్, బొడ్ల  రమేష్, నిరంజన్, శోభన్ రాజిరెడ్డి,   జిల్లా కార్యదర్శి కంభంపాటి అంజయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్, సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్, సారగండ్ల కోటేశు, తాండూ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333