ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ వ్యాపారాలపై డీఈఓకి ఫిర్యాదు
బొంకూర్ సురేష్ మహారాజ్*

జోగులాంబ గద్వాల 24 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ విధులకు వ్యతిరేకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తున్నారని సురేష్ మహారాజ్ జిల్లా విద్యా అధికారి (DEO) కార్యాలయంలో సూపరింటెండెంట్ రామకృష్ణ కి ఫిర్యాదు అందజేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు:
ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ ఉద్యోగ పరిమితులను ఉల్లంఘించి వ్యాపారాలలో పాల్గొంటున్నారు.
CCS Conduct Rules, 1964 – Rule 15 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారం చేయరాదు.
IPC సెక్షన్ 168 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వ్యాపార లావాదేవీలు నేరంగా పరిగణించబడతాయి.
విద్యార్థులకు పూర్తి సమయం కేటాయించకుండా వ్యాపారాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
అక్రమ సంపాదనను భాగస్వాముల పేర్లపై దాచుతూ ప్రభుత్వానికి ఆదాయపు పన్ను ఎగ్గొడుతున్నారు.
సురేష్ మహారాజ్ మాట్లాడుతూ, "ప్రభుత్వ ఉపాధ్యాయులు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ విద్యార్థులకు సమర్థమైన బోధన అందించకుండా వ్యాపారాల్లో పాల్గొనడం సరికాదు. విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తున్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈఓని కోరుతున్నాను" అని పేర్కొన్నారు.
విద్యా రంగంలో అవినీతిని అరికట్టాలంటూ ప్రజల డిమాండ్! ఆయన అన్నారు.