ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
తిరుమలగిరి 04 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:
అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని, ఇంటి స్థలాలు లేని పేదలను గుర్తించి ఇంటి స్థలం కేటాయించి గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం తిరుమలగిరి మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి అనంతరం ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక రకాల వాగ్దానాలు చేసిందని,కానీ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచిన ఇప్పటికీ వాటి అమలుకు పూనుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా కొత్త రుణాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికులకు జీవనోపాధికి అనుగుణంగా పెన్షన్స్ స్కీములను రూపొందించాలన్నారు.విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ప్రకటించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుంటే మా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా మాజీ అధ్యక్షులు వేరుపుల లక్ష్మన్న,నాయకులు మీనయ్య,నారాయణ,అంజయ్య పి.వై.ఎల్ జిల్లా నాయకులు వేరుకుల పరుశురాం,హుస్సేన్,పార్టీ డివిజన్ నాయకులు కందుకూరి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.