ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి

ఏఐటీయూసీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు
అడ్డగూడూరు 01 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఏఐటియుసి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేసిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెడే చంద్రయ్య మాట్లాడుతూ..అమెరికాలోని చికాగో నగరంలో 18 గంటల పని విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన పోరాటానికి మరణించిన కార్మికుల రక్తంతో తడిచిన కార్మికుని చొక్కానే ఎర్రజెండాగా ఆవిష్కరించిందని అన్నారు. ఆరోజు జరిగిన పోరాటం గుర్తుగానే బుధవారం రోజు మేడే గా కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఉప్పుల శాంతి కుమార్ ఏఐటీయూసీ ఆటో యూనియన్ అడ్డగూడూరు మండల నాయకులు ఎలిజాల అశోక్, గడ్డం శంకరయ్య…