ప్రపంచంలోనే భారత రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు

అమరుల త్యాగఫలమే దేశానికి  స్వాతంత్య్రం

Jan 26, 2025 - 16:55
Jan 26, 2025 - 16:59
 0  10
ప్రపంచంలోనే భారత రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు
ప్రపంచంలోనే భారత రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు

సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ 

(సూర్యాపేట టౌన్,జనవరి 26) బ్రిటిష్ వలసవాదుల పాలన నుండి దేశాన్ని విముక్తి చేయడం కోసం జరిగిన స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి అమరులైన అమరవీరుల త్యాగ ఫలితoగానే  భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ కార్యాలయంలో 76వ, గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశ స్వాతంత్రం కోసం గాంధీజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి ఎంతోమంది త్యాగదనులు పోరాడారని కొనియాడారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం తో పాటు యావత్ ప్రపంచం గర్వించే విధంగా  1950 జనవరి 26న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు.

 భారత రాజ్యాంగం వల్లనే దేశంలో ప్రస్తుతం చట్టాలు నడుస్తున్నాయని చెప్పుకొచ్చారు. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కూడా ఏర్పాటయిందని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. భారతదేశం ఉన్నంతకాలం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పంతంగి వీరస్వామి గౌడ్ కొనియాడారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా గౌరవ సలహాదారులు దేవత్ కిషన్ నాయక్, రియల్ ఎస్టేట్ జిల్లా ఉపాధ్యక్షుడు sk బాబా సీనియర్ రియల్ ఎస్టేట్ వ్యాపారీ బాబుమియ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్, అయితే గాని మల్లయ్య గౌడ్ పట్టణ ఉపాధ్యక్షులు ఖమ్మం పాటి అంజయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్ బానోత్ జానీ నాయక్, ఆకుల మారయ్య, ఐతగాని మల్లయ్య, పట్టేటి కిరణ్, రమేష్ పాల్వాయి వెంకన్న, తన్నీరు వాసు, మండల్ రెడ్డి వెంకట్ రెడ్డి రేసు నాగయ్య గౌడ్ కోడి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333