ప్రణయ్ హత్య కేసు తీర్పు కులదురహంకారులకు చెంపపెట్టు.... 

Mar 10, 2025 - 21:43
Mar 10, 2025 - 21:46
 0  3
ప్రణయ్ హత్య కేసు తీర్పు కులదురహంకారులకు చెంపపెట్టు.... 

ప్రణయ్ కుటుంబానికి రక్షణ కల్పించాలి...

 కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు

సూర్యాపేట, 10 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- మిర్యాలగూడలో కుల దురహంకార హత్యకు బలైన పెరుమాళ్ళ ప్రణయ్ హత్య కేసు తీర్పు కుల దురహంకారులకు చెంపపెట్టు లాంటిదని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పేట్ల స్కైలాబ్ బాబు అన్నారు. *ఈరోజు కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఎంవిఎన్ భవన్ లో ప్రణయ్ తీర్పు పై చర్చ గోష్టి కార్యక్రమం కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతతూ నల్గొండ జిల్లా మిర్యాల గూడలో 2018లో వైశ్య కులానికి సంబంధించిన అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే పేరిట పెరుమాండ్ల ప్రణయ్ అనే  దళిత యువకుడిని అత్యంత కిరాతకంగా కోటి రూపాయలు ఇచ్చి హత్యగావింపజేశారని అన్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న మారుతి రావు 2020లో ఆత్మహత్య చేసుకున్నాడని మిగిలిన ఏడుగురు నిందితులలో ఏ2 శర్మకు ఉరిశిక్షతోపాటు మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించి ఇచ్చిన తీర్పును కెవిపియ సంపూర్ణంగా స్వాగతిస్తుందన్నారు. కోర్టులపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ప్రణయ్ తీర్పు ఉందన్నారు.ఈ తీర్పు తర్వాత ప్రణయ్ కుటుంబానికి అమృత బాలస్వామికి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని వారు కోరారు.

 రాష్ట్రంలో 128 కుల దురహంకార హత్యలు జరిగాయన్నారు.నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు మిగిలిన చోట జరిగిన కుల దురహంకారులకు కనువిప్పు కలగాలన్నారు  కుల దురహంకారులను పౌర సమాజం ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాలని అన్నారు. ఇటీవల సూర్యాపేటలో కూడా వద్లకొండ కృష్ణను అతి కిరాతకంగా హత్య చేశారని ఈ కేసును పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమళ్ళ హస్సన్, సీనియర్ జర్నలిస్ట్, గోల్డ్ మెడలిస్ట్ బంటు కృష్ణ, కందుకూరి యాదగిరి, ప్రముఖ కార్టూనిస్ట్ పల్లె మనిబాబు, శిరంషెట్టి ఆనంద్, పి ఎన్ ఎం జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, టిపిటిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు జె.నరసింహారావు, నవ తెలంగాణ ఇన్చార్జి వెంకట్ రెడ్డి,నాగయ్య, మాల మహానాడు జిల్లా నాయకులు దాసరి దేవయ్య,కాశిమల్ల వెంకటనరసయ్య,బోయిల్ల అఖిల్ కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు టేకుల సుధాకర్ ప్రజా నాట్య మండల జిల్లా నాయకులు నందిపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333