ప్రజా ఫిర్యాదుల పై సత్వర పరిష్కారానికి కృషి:జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు
జోగులాంబ గద్వాల ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: వివిధ సమస్యల పై వచ్చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి పోలీస్ అధికారులు కృషి చెయ్యడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ ఎస్పీ కార్యాలయానికి వివిధ సమస్యల పై వచ్చిన 08 మంది భాదితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.భాధితుల సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు.జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణలో జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేకూర్చాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్పి శ్రీ వై. మోగిలయ్య , గద్వాల సీఐ టి శ్రీను పాల్గొన్నారు.
ఈ రోజు ప్రజావాణిలో వచ్చిన 08 ఫిర్యాదులు
భూ వివాదాలకు సంబంధించి -02
అన్నదమ్ముల గొడవలకు సంబందించి -01
భర్త వేధింపులకు సంబందించి -01
ఇతర అంశాలకు సంబంధించి -04 అని పి ఆర్ ఓ ఆఫీస్ నుంచి తెలియజేశారు.