ప్రజా పోరాట విజయంతో పెద్ద ధన్వాడలో సంబరాలు
జోగులాంబ గద్వాల 4 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఐజ ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ రైతులు, మహిళలు, యువకులు 12 గ్రామాల రైతులు సాధించిన తొలి విజయాన్ని మహనీయులు అంబేడ్కర్, జ్యోతిరావు ఫూలే కు పూలమాలలు వేసి, టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
కంపెనీ ప్రతినిధులు పెద్ద ధన్వాడ నుండి వేరే రాష్ట్రంలో స్థాపించడం కోసం అప్లికేషన్ పెట్టుకున్న విషయం తెలుసుకున్న రైతులు అందరూ ప్రజా విజయం అని అంబేడ్కర్, ఫూలే విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పించి ప్రజల ఐక్య పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు.
మహనీయుల స్ఫూర్తితో కంపెనీ రద్దు అయ్యేదాక ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.