**ప్రజాస్వామ్య పరిరక్షకుడు డాక్టర్ అంబేద్కర్""అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా""కోదాడలో

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ :ప్రజాస్వామ్య పరిరక్షకుడు అంబేద్కర్
కోదాడలోని కె. ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ విభాగం (జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి,భారతరత్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి, తెలుగు లెక్చరర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించిన అనంతరం అధ్యాపకులు రనబోతు పిచ్చిరెడ్డి మాట్లాడుతూ.... అంటరానితనం, కుల వివక్ష పై అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. తెలుగు లెక్చరర్ వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ....
సమాజంలో కులాల కుళ్ళును, మతాల మౌడ్యాన్ని, బడుగుల బాధలు, గుండెలవిసిన జీవితాలను చూసి అందరిలో వెలుగులను, సిరిసంపదలను, చదువును అందించిన మహనీయుడు అంబేద్కర్ అని, అనగారిన కులం నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన మహనీయుడని, భారతదేశ తొలి న్యాయ శాఖ మంత్రిగా అందరికీ సమన్యాయం అందించారని, నిమ్న జాతులకు అండగా నిలిచి, కార్మికులలో చైతన్యాన్ని నింపి అందరివాడయ్యాడు అని, ఆయన చూపించిన మార్గంలో కులాలకు అతీతంగా, మతాల కతీతంగా అందరూ పయనించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జి. యాదగిరి, బి.సైదిరెడ్డి,జి.సైదులు,జి. ఎల్.యన్.రెడ్డి, పి.సైదులు, టి.రాజు, ఎల్.సురేష్,SK. హఫీజ్ మొదలగువారు పాల్గొన్నారు.