ప్రజావాణి పిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలి 

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

Mar 23, 2026 - 18:33
Mar 23, 2026 - 19:43
 0  1
ప్రజావాణి పిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలి 
ప్రజావాణి పిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలి 
ప్రజావాణి పిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలి 

ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు...... జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

సూర్యాపేట, 24 మార్చి 2026 తెలంగాణవార్త విలేఖరి:- ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని, ఫిర్యాదులను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు..సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.. రాష్ట్ర స్థాయి గ్రీవిన్స్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పనులు చేయడం జరుగుతుందని కానీ కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా పనులను పూర్తి చేయడం లేదని పేర్కొన్నారు.. పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.15వ ఫైనాన్స్ కింద వచ్చిన నిధులతో అంగన్వాడీ కేంద్రాలలో బ్యాలెన్స్ పనులను పూర్తి చేయాలని, పీహెచ్సీలను  ఆధునికరణ చేయాలని ఆదేశించారు.. అదే విదంగా గ్రంధాలయాల కోసం ఈ నిధులని వినియోగించాలన్నారు..

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 49 దరఖాస్తులు, డిపిఓ 5, డి ఆర్ డి ఏ 3, డిఎంహెచ్వో 3,  మిగిలిన 9 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 69 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు.

ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కే సీతారామారావు, సీఈఓ జడ్పీ శిరీష,  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, సిపిఓ కిషన్,  డీఎఫ్ఓ సతీష్, సంక్షేమ అధికారులు నర్సింహారావు, నరసింహ, శంకర్ జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు హాజరైనారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333