ప్రజలను చైతన్య పరిచిన స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్
ఖమ్మం, 24 మార్చి 2026 తెలంగాణవార్త విలేఖరి:- ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో సేవాలాల్ విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు భూక్య సాయికుమార్ నాయక్ అధ్యక్షతన భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . తోలుతూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . భారత స్వాతంత్ర్య సమర యోధుడు , ప్రఖ్యాత ఉద్యమకారుడు , ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచి విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చి భారత స్వాతంత్ర్యోద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో భగత్ సింగ్ ఒకడు అని కొనియాడారు . ఈ కార్యక్రమంలో తేజ సాయి కృష్ణ , రవికుమార్ , వంశీ , వినోద్ , నవీన్ , మహేష్ , యమునా , శృతి , కల్పన , జ్యోతి , ప్రియాంక , నాగమణి , శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు .