టిడబ్ల్యూజేఎఫ్ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఇరుగు సైదులు ఏకగ్రీవ ఎన్నిక 

Mar 20, 2026 - 19:08
 0  15
టిడబ్ల్యూజేఎఫ్ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఇరుగు సైదులు ఏకగ్రీవ ఎన్నిక 

తుంగతుర్తి, 20 మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) తుంగతుర్తి నియోజకవర్గ సమావేశం తుంగతుర్తి పట్టణంలోని రిటైర్డ్ టీచర్స్ భవనంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఇరుగు సైదులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక పట్ల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. అనంతరం టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పాల్వాయి జానయ్య మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. యూనియన్ బలోపేతానికి, తమ హక్కులను సాధించుకోవడానికి జర్నలిస్టులు ఐక్యమత్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు.  నూతన కమిటీకి పూర్తిస్థాయిలో జర్నలిస్టు మిత్రులకు సహకారం  అందించాలన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఓరుగంటి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు వంగాల వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు గుడపూరి ప్రభాకర్, మండల అధ్యక్షుడు గుండగాని రాము, ఉపాధ్యక్షులు రామకృష్ణ, సీనియర్ జర్నలిస్టులు తడకమల్ల సురేష్, యాకన్న, షేక్ జానీ, ఎనగందుల అశోక్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333