ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదు దారుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ నరసింహ
ఈ రోజు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు సూచనలు చేశారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి వచ్చిన అర్జీల తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ కి సూచనలు చేయడం జరిగింది. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ,వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.