పోలీస్ సిబ్బంది స్వీయ నియంత్రణ, ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలి:
పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు సిబ్బందితో ఎస్పీ నరసింహ ఐపీఎస్ ప్రత్యేక సమావేశం.
పోలీస్ సిబ్బంది స్వీయ నియంత్రణ, ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలి:
క్రమశిక్షణతో కూడిన శిక్షణ తీసుకున్నాం, సమాజంలో సాధారణ పౌరులకు ఆదర్శంగా ఉండాలి.
బెట్టింగ్ సంస్కృతికి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సిబ్బందికి పిలుపు.
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్.
సమాజ భద్రత, పౌరుల భద్రతలో పోలీసు సిబ్బంది నిరంతరం కృషి చేస్తూ పోలీసు సేవలు అందించాలి. అప్పులు చేయడం, భద్రత లేని వ్యాపారాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి, పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనం, స్వీయ నియంత్రణ అలవర్చుకోవాలి, ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు పేర్కొన్నారు. ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు పోలీసు సిబ్బందితో ఎస్పీ గారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సిబ్బందికి పలు కీలకమైన ఆర్థిక పరమైన సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు హాజరై సిబ్బందికి క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణ అంశాల గురించి సుదీర్ఘంగా వివరించారు.
సమావేశంలో ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు. సమాజంలో పోలీస్ యూనిఫాంకు ఎంతో గౌరవం ఉంది. కఠినమైన శిక్షణ పొందిన పోలీసులు ఇతరులతో పోలిస్తే భిన్నంగా, సమాజానికి ఆదర్శంగా నిలవాలి. అధిక లాభాల ఆశతో ఎలాంటి భద్రత లేని పథకాలు, అనాధికారిక సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు. బెట్టింగ్‌లు, సోషల్ మీడియా వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. అనవసర విలాసాల కోసం అప్పులు చేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు. సిబ్బంది ఎల్లప్పుడూ దీర్ఘకాలిక ప్రయోజనాల వైపు, తమ కుటుంబ ఆర్థిక భద్రత వైపు ఆలోచన చేయాలి, పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి. నిరంతరం ఒత్తిడితో కూడిన విధుల్లో ఉండే పోలీసులు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు సిబ్బంది ఎలాంటి తప్పులు, నేరాలకు పాల్పడకూడదు, సిబ్బందికి వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సమస్యలు ఏవైనా ఉంటే నిర్భయంగా ఉన్నతాధికారులకు చెప్పుకుని పరిష్కరించుకోవాలి.
ఈ సంక్షేమ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిసిఆర్బి డీఎస్పీ రవి, అడ్మిన్ అధికారి మంజు భార్గవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నారాయణరాజు, ప్రవీణ్ కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూర్యాపేట రీజినల్ చీఫ్ మేనేజర్ అరుంధతి, ఫైనాన్సియల్ అసిస్టెంట్ మేనేజర్ రామిరెడ్డి, జిల్లాలోని పలువురు ఎస్సైలు, ఆర్ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు.