మానవపాడు మండలం ఎమ్మార్పీఎస్ నూతన ఇంచార్జ్ గా శాంతకుమార్ 

Aug 25, 2026 - 19:55
 0  5
మానవపాడు మండలం ఎమ్మార్పీఎస్ నూతన ఇంచార్జ్ గా శాంతకుమార్ 

ఆగస్టు 25 తెలంగాణ/ మానవపాడు

జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గం, మానవపాడు మండలంలో దళిత, బహుజన ఉద్యమాలకు కంచు కోటగా నిలిచిన ఎమ్మార్పీఎస్ కు కొత్త నాయకత్వం వచ్చిందని కుల సంఘ నాయకులు చర్చించుకుంటున్నారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు జిల్లా రాష్ట్ర కమిటీ వారు  జల్లాపురం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త శాంతకుమార్ మాదిగ ను మానవపాడు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా నియమించారు.సామాజిక కార్యకర్త శాంతకుమార్ నూతన బాధ్యతలు చేపట్టిన అనంతరం శాంతకుమార్ మాదిగ  మాట్లాడుతూ. యువతే ఉద్యమ భవిష్యత్ అని ప్రస్తావించారు.నాయకత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన అన్నారు.ఇది ఒక బాధ్యతో కూడిన పదవి అన్నారు.ఇది మాదిగ కులానికే కాకుండా మండలంలో ఉన్న అన్ని కులాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలతో సహా అణగారిన బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం చేసే ఉద్యమానికి దొరికిన చక్కటి అవకాశం అన్నారు. గ్రామస్థాయి నుంచే కమిటీలను బలోపేతం చేసి, విద్యార్థులకు, యువతకు ఉద్యమ స్ఫూర్తిని అందిస్తామని, రిజర్వేషన్ల సాధనతో పాటు స్థానిక సమస్యలపై గట్టిగా పోరాడతామని ఆయన ప్రకటించారు. ఈ నియామకంతో మానవపాడు మండలంలోని ఎమ్మార్పీఎస్  కార్యకర్తల్లో, కుల సంఘాల నాయకుల్లో కొత్త ఉత్సాహం నెలకొందన్నారు.  సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడే ఎమ్మార్పీఎస్ కుటుంబంలోకి యువత ముందుకు రావాలని   పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కాశపోగు జాన్, కురుమన్న, భాస్కర్ మరియు జగ్గుల ప్రభాకర్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333