శ్రీ తిమ్మప్ప స్వామికి బంగారు ద్వాదశనామాలు వితరణ

Aug 25, 2026 - 17:20
Aug 25, 2026 - 17:21
 0  2
శ్రీ తిమ్మప్ప స్వామికి బంగారు ద్వాదశనామాలు వితరణ

జోగులాంబ గద్వాల 25 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఆది శిలాక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి బిజ్వారం గ్రామానికి చెందిన డాక్టర్ ఆగ్యపోగు అశోక్ డాక్టర్ ప్రియాంక దంపతులు రూ.1,54,000 విలువచేసే మూడు బంగారు ద్వాదశ నామాలను స్వామివారికి బహుకరించారు. మంగళవారం దేవాలయంలో వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి అందజేయగా పూజలు నిర్వహించి అలంకరించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు స్వామి వారికి అలంకరించాలని భక్తులు కోరగా ప్రతినిత్యం స్వామి వారి అలంకారంలో ఉంచాలని అర్చకులను చైర్మన్ ఆదేశించారు. అనంతరం దాతలను స్వామివారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు..

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State