తొలి బహుజన రాజ్య స్థాపకుడు సర్వాయి పాపన్న గౌడ్

Aug 18, 2026 - 22:47
 0  0
తొలి బహుజన  రాజ్య స్థాపకుడు సర్వాయి పాపన్న గౌడ్

  తిరుమలగిరి 19 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

మొఘల్ సామ్రాజ్య ఆధిపత్యాన్ని, స్థానిక జాగీర్దారులు, జమీందారులు అరాచకాలను గెరిల్లా యుద్ధతంత్రంతో ఎదురించి, గోల్కొండ కోటపై విజయ పతాకాన్ని ఎగురవేసి తొలి బహుజన రాజ్య స్థాపకుడుగా సర్దార్ సర్వార్ పాపన్న గౌడ్ నిలిచాడని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకరి జనార్ధన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి కార్యక్రమాన్ని మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం మాట్లాడారు. సమాజంలో అణచివేతకు గురవుతున్న బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఏకం చేసి ఆయన ఒక శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించారన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు సమకాలికుడైన పాపన్నను, తెలంగాణ ప్రాంతంలో మొఘల్ అణచివేతపై తిరుగుబాటు చేసినందుకు ఆయనను తెలంగాణ శివాజీగా కొనియాడుతారన్నారు. అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. పాపన్నగౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని బహుజనుల అభ్యున్నతికి, సమాజంలో సమానత్వం కోసం కృషి చేయడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో  గౌడ సంఘం నేతలు పార్టీ కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి