ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయలు దండుకున్నారు

Apr 29, 2024 - 20:32
 0  31
ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయలు దండుకున్నారు

తెలంగాణ వార్త కొండపాక:-  ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ హరీష్ రావు ...రాజీనామా తో సిద్ధంగా ఉండు  రాముడు పేరుతో రాజకీయాలు

కొండపాక ఏప్రిల్ 29 తొమ్మిదిన్నర  సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయలు దండుకున్నారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండ సురేఖ అన్నారు. సోమవారం గజ్వేల్ నియోజకవర్గం కొండపాక కుకునూరు పల్లి మండల కేంద్రాల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. బిఆర్ఎస్ హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదని అన్ని సంవత్సరాల పాలనలో  చేయకుండా ప్రజలను మోసం చేసి నాలుగు నెలల కాంగ్రెస్ పాలనపై విరుచుకు పడడం సిగ్గుచేటు అన్నారు. నాలుగు నెలల్లో ఇచ్చిన ఆరు హామీలలో ఐదు హామీలను నెరవేర్చమన్నారు. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో వైయస్సార్ ను చూసి ఎలా ఉండకూడదు కేసీఆర్ చూసి తెలుసుకున్నారని అన్నారు. కాలేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల పేరుతో కోట్ల ఐదు రూపాయల కమిషన్లు దండుకున్న కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. అహంకారపూరితంగా వ్యవహరిస్తూ షాడో సీఎం గా కేటీఆర్  వ్యవహరించాడన్నారు. గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి శూన్యమని సీఎంగా వ్యవహరించిన తన నియోజకవర్గంలోని అభివృద్ధి కాకపోతే ఇక రాష్ట్రం ఎలా ఉంటుందని తెలుసుకోవచ్చు అన్నారు. టిఆర్ఎస్ బిజెపి రెండు ఒకటేనని లిక్కర్ కాలంలో జైలు పాలైన కవితను కాపాడుకోవడం కోసం బిజెపితో కేసిఆర్ చేతులు కలుపుతున్నాడని ఆరోపించారు. టిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామారెడ్డి భూములు కబ్జా చేసి కోట్లు గడిచాడని ఆరోపించారు కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీలను తరిమికొట్టాలన్నారు.
ఆగస్టు 15 లో రుణమాఫీ చేస్తామని  హరీష్ రావు రాజీనామాతో సిద్ధంగా ఉండాలన్నారు.రిజర్వేషన్ రద్దు చేస్తే పిల్లల పరిస్థితి ఎం కావాలన్నారు.నీలం మధుని గెలిపించి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి డిసిసిబి అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూమిరెడ్డి మాట్లాడారు. నాయకులు ఆంక్ష రెడ్డి, లింగారావు, శ్రీనివాస్ రెడ్డి, పోల్కంపల్లి నరేందర్, నవీన్ కుమార్, సురేందర్ రావు కందూరి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. కొండపాక కుకునూరుపల్లి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333