పొలాలు పరిశీలిస్తున్న తెలంగాణ తెలుగుదేశం నాయకులు

కొండబాల కరుణాకర్ బృందం

Aug 18, 2024 - 23:24
 0  12
 పొలాలు పరిశీలిస్తున్న తెలంగాణ తెలుగుదేశం నాయకులు

సీతారామ ప్రాజెక్టు ను పాలేరుకు అనుసంధానం చేయండి...!

ప్రబలుతున్న విష జ్వరాలను కట్టడి చేసే చర్యలు తీసుకోవాలి...!!

తెలుగుదేశం పాలేరు ఇంచార్జ్ కొండబాల కరుణాకర్ డిమాండ్..

పాలేరు ప్రతినిధి/తెలంగాణ వార్త...ఆగస్టు 18 ఆదివారం. ఖమ్మం జిల్లా వ్యాపితంగా విష జ్వరాలు ప్రభలుతున్నాయని తెలుగుదేశం నాయకులు ఆందోళన వెలిబుచ్చారు, నియోజకవర్గ వ్యాప్తంగాగ్రామాల్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ మరియు చికెన్ గున్యా తదితర జ్వరాల భారిన ప్రజలు పడుతున్నారని ప్రభుత్వ ప్రైవేటు  దవాఖానాలతో జనం కిటకిట వాడుతున్నారని యుధ్ద ప్రాతిపధికన తెలంగాణ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని నేలకొండపల్లి లో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో పాలేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కరుణాకర్ ఆదివారం మాట్లాడుతూ  ఎక్కువగా పేద మధ్యతరగతి రైతు కూలీలు ఈ విషజ్వరాల భారిన పడి వైద్యం చేయించుకునే స్ధోమత లేక ప్రాణాలు విడుస్తున్నారని కావునా గ్రామాల్లో బ్లీచింగ్ దోమల మందు పిచికారి చేయాలని గ్రామానికి ఒక డాక్టరుని మరియు సిబ్బందిని తాత్కాలికంగా నియమించి వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.అలాగే రైతు రుణమాఫీ కూడ రైతులందరికి చేయలేదని తెల్ల రేషన్ కార్డుతో సంభందం లేకుండా రెండు లక్షల రూపాయలు మాఫీచేయాలని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ గోదావరి జలాలను పాలేరు చెరువులో పడే విదంగా త్వరితగతిన పనులు చేయాలని డిపిఆర్లో లో లేని లింక్ కెనాల్ ని ఏన్కూరు వద్ద తవ్వి మరల సాగర్ కాల్వ ద్వారా సత్తుపల్లి ప్రాంతానికి తీసుకు పోవటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, పాలేరు చెరువు ద్వారా అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం శస్యస్యామల మవుతుందని పేర్కొన్నారు.జిల్లాకి చెందిన మంత్రులు పెద్దమనసుతో ఆలోచించి సీతారామా ప్రాజెక్టుని పాలేరు చెరువుకి అనుసంధానం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో  లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి అప్పారావు, జిల్లా కార్యదర్శి నల్లమాస మల్లయ్య, మండల నాయకులు పావులూరి వెంకటేశ్వరావు,  జిల్లా నాయకులు పాలడుగు క్రిష్ణప్రసాద్, రాయల కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ పచ్చా సీతారామయ్య, పార్టీ గ్రామ అధ్యక్ష కార్యదర్షులు పచ్చ జనార్ధన్ గారపాటి ప్రసాద్, రాయల వెంకటరామారావు  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333