పెబ్బేర్ ప్రెస్ క్లబ్ పై దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న బొడ్డుపల్లి.రాజు(కేతపల్లి) పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్,ఎస్పీ, డిపిఆర్ఓ కు ఫిర్యాదు చేసిన పెబ్బేర్ ప్రెస్ క్లబ్ సభ్యులు

Mar 22, 2025 - 19:17
Mar 22, 2025 - 19:18
 0  4
పెబ్బేర్ ప్రెస్ క్లబ్ పై దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న బొడ్డుపల్లి.రాజు(కేతపల్లి) పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్,ఎస్పీ, డిపిఆర్ఓ కు ఫిర్యాదు చేసిన పెబ్బేర్ ప్రెస్ క్లబ్ సభ్యులు

గతంలో ప్రభుత్వ పత్రిక విలేఖరిగా పనిచేసి అక్రమాలకు పాల్పడిన కేతపల్లి రాజుపై ఆధారాలతో ఎస్పీకి అందజేయడం జరిగింది...

బొడ్డుపల్లి రాజుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన జిల్లా ఎస్పీ& కలెక్టర్

వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రెస్ క్లబ్ పేరుపై దొంగ రిజిస్ట్రేసన్ చేసిన కొందరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ రిజస్ట్రార్ గారితో మాట్లాడి అట్టి దొంగ రిజిస్ట్రేషన్ ను కాన్సల్ చేయించాలని గతంలో ప్రభుత్వ పత్రిక విలేఖరిగా పనిచేసి అక్రమాలకు పాల్పడిన రాజుపై ఆధారాలతో..పెబ్బేరు జర్నలిస్టులు  జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ గారికి మరియు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గారికి మరియు డీపీఆర్వో సీతారాములు గారిని కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.బొడ్డుపల్లి రాజు(కేతపల్లి)పై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ, కలెక్టర్ హామి ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాలవర్ధన్ మాట్లాడుతూ.. బొడ్డుపల్లి రాజు(కేతపల్లి) అనే వ్యక్తి తన స్వప్రయోజనాల కోసం  ఒక పెబ్బేరు ప్రెస్ క్లబ్ పేరుతొ నకిలీ వాట్సాప్ గ్రూప్ ను తయారు చేసి... ప్రెస్ క్లబ్ పేరుపై వాట్సప్ స్టేట్స్ లు లోగోలు తయారు చేసుకుని, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. నిజమైన కమిటీ, ఇతర జర్నలిస్ట్ లను వారి అనుమతి లేకుండా యాడ్ చేసి వారికి మా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న ప్రెస్ క్లబ్ పెబ్బేరు పేరుతో మహబూబ్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసు లో మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, మా అనుమతి లేకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాడు. ప్రెస్ క్లబ్ ఈ విషయమై గురువారం మహబూబ్ నగర్ రిజిస్ర్టేషన్ ఆఫీసులోనూ ఆ రిజిస్ర్టేషన్ ను రద్దు చేయాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రధానమైన పత్రికల్లో పని చేయకపోవడంతో తన ఉనికి పడిపోతుందని దురుద్దేశంతో  ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులకు తెలియజేయకుండా తన సొంతంగా ప్రెస్ క్లబ్ పెబ్బేరుపై దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాలవర్ధన్ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333