త్యాగం లోను ఫలితం ఉంటుంది. అద్దంకి దయాకర్

May 11, 2025 - 20:33
 0  8
త్యాగం లోను ఫలితం ఉంటుంది. అద్దంకి దయాకర్

తెలంగాణ వార్త ఆత్మకూర్ ఎస్ త్యాగం లోను ఫలితం ఉంటుంది అభిమానాన్ని వదలకుంటా ఆడుకుంటాను. నెమ్మికల్ లో సన్మాన సభలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్.. ఆత్మకూరు ఎస్. తనను ఉన్నత పదవి లో చూడాలని అభిమానం తో 11ఏళ్లుగా ఎందరో ఆశతో ఎదురు చూశారని వారి ఆశల దీవెనల తోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి నించిందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఆదివారం తన స్వగ్రామం అయిన ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్ గ్రామాల్లో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన కారణంగా ఏదో ఒక రోజు పార్టీ గుర్తిస్తుందని భావించిన విధంగానే ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాలు ఎలకపాత్ర పోషించిన జేఏసీ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చాక పార్టీ తన స్థాయికి మించి బాధ్యతలను అప్పగించిందని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల్లో అద్దంకి దయాకర్ పదవి రావాలని ఎంతోమంది అభిమానులు ఎదురు చూశారని వారందరూ ఆశలుసమాజానికి ఏదో ఒక విధంగా మంచి చేస్తారని అభిప్రాయం వారి అభిప్రాయం తప్పక నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. తన పుట్టినరోజు ఎన్నో సమస్యలు ఎలా ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కారం కోసం తన పార్టీ నేతలతో మంత్రులతోను ముఖ్యమంత్రి తోనూ సహకారం తో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తన అభివృద్ధికి ఉన్నత స్థితికి సహకారం దేశం నా శ్రేయోభిలాషులకు అన్ని విధానంగా ఆదుకుంటారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయo లో పూజలు నిర్వహించారు.అంబేద్కర్ విగ్రహాo పాదాల కు పాలాభిషేకం చేషారు. క్రీస్తు రాజు దేవాలయం లో ఫాదర్ అలెగ్జాండర్ చే దీవెన పొందారు. ఈ కార్యక్రమం లో మనం ఫౌండేషన్ గంపల కృపాకర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం లో సమాజిక సేవా జేఏసీ చైర్మన్ భూపతి రాములు, గంపల కృపాకర్,గంపల నారాయణ ,జానకి రెడ్డి మాట్లాడారు. ఇటివల ఉత్తమ జర్నలిస్టు అవార్డు పొందిన ఆంధ్రప్రభ జర్నలిస్టు పల్లా పరమేశ్ ను అద్దంకి దయాకర్ ఘనంగా సన్మానించారు. అద్దంకి దయాకర్ ను సన్మానించిన వారిలో  వేల్పుల వెంకన్న, యాదగిరి, ప్రకాశ్, గంపల లింగయ్య, సైదులు,ada ఎల్లయ్య, వార్డెన్ లింగయ్య,కొంపల్లి మల్లారెడ్డి, గుంటూరు చిట్టిబాబు, రామక్రిష్ణ, గంగరబోయిన శ్రీను,గురుస్వామి, జలగం కృష్ణ, మల్లేశ్, కాటూరి రాములు తదితరులు పాల్గొన్నారు