పెద్ద తాండాలో తాగునీటి కొరత
జోగులాంబ గద్వాల 4 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల . జిల్లా వ్యాప్తంగా బారి వర్షాలు పడుతున్న గాని గుక్కెడు తాగునీల్లకోసం ప్రజలు అల్లాడుతున్నారు.చాలా గ్రామాల్లో అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజాపాలన అదికారులు గాలికొదిలేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. తాజాగా మల్దకల్ మండలం పెద్ద తాండా లో గత వారం రోజులుగా తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షానికి నానుకుంటూ బోరెంగిల దగ్గర, బోర్ల దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటూ ప్రజలు యిబ్బందులు పడుతున్నారు. సమస్య ఎవరికైన చెప్పుకుందామంటే పంచాయతీ ఆఫీస్ 24గంటలు తాళం వేసి ఉంటుంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరు, ఎలా ఉంటాడో కుడా గ్రామ ప్రజలకు తెలియదంటున్నారు.ఈ విషయాన్ని స్పందించి పై అధికారులు వెంటనే పెద్ద తాండలో నీటి సమస్య తీర్చాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.