పెట్రోల్ బంకుల్లో సౌకర్యాల కొరత

Jul 2, 2025 - 14:52
Jul 2, 2025 - 19:07
 0  0
పెట్రోల్ బంకుల్లో సౌకర్యాల కొరత

చర్ల జులై 2   పెట్రోల్ బంకుల్లో సౌకర్యాల కొరత లేదంటే ఓనర్ కి ఫైన్ మోత 

 వినియోగదారులు అవస్థలు అధికారుల నిర్లక్ష్యo

న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ 

చర్ల మండలంలో ఉన్న పెట్రోల్ బంకులలొ కనీస మౌలిక సౌకర్యాలు లేక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని *సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు

 ఈ సందర్భంగా ముసలి సతీష్ మాట్లాడుతూ ఉచిత ఎయిర్ పంపింగ్ ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు ఇంధన నాణ్యత పరీక్ష సౌకర్యం ఫిర్యాదులు పెట్టె ధరల పట్టిక ప్రధమ చికిత్స కిట్టు శుభ్రమైన త్రాగు నీరు మరుగుదొడ్లు తప్పనిసరి సేవలు అందుబాటులో లేవని వినియోగదారులు చెబుతున్నారని ముసలి సతీష్ అన్నారు మరుగుదొడ్లు సౌకర్యం లేకపోవడంతో పాటు శుభ్రతతో లోపంతో మహిళలు అసౌకర్యానికి గురవుతున్నారనీ ముసలి సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు ఇంధన నాణ్యత పరీక్షలకు అవసరమైన పరికరాలు సీల్డ్ బాక్సుల్లో ఉందన్న నిల్వ లేకపోవడం వంటి పరిస్థితులు నెలకొన్నాయని అంతేకాకుండా సిబ్బంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అధికారుల పర్యవేక్షణ కూడా లేదని ముసలి సతీష్ అన్నారు దీనికి సంబంధించిన అధికారులు స్పందించి పెట్రోల్ బంకులో నియమ నిబంధనలు అమల అయ్యేలా చూడాలని అన్ని సౌకర్యాలు కల్పించి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ముసలి సతీష్ పెట్రోల్ బంకులకు సంబంధిత అధికారి చర్ల మండల తాసిల్దార్ గారికి సివిల్ సప్లై అధికారులను పెట్రోల్ బంకుల పైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నామ్ చర్యలు తీసుకోకపోతే ఖబర్దార్ అధికారులారా మీ ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం