పుస్తకాల సంచుల మోత విద్యార్థుల ఆరోగ్యాల పైన చెరగని వాత

Aug 31, 2025 - 21:53
 0  5

నిబంధనలు ఉన్న అమలు చేయని పాలకుల తీరు ఆశ్చర్యకరం.* అదే గొప్ప అనుకొని సంతోషపడే తల్లిదండ్రుల ఆలసత్వం* నడుము వెన్నెముక ఎముకల రోగాలతో ఏడ్వాల్సిందేనా?

*****************************

--- వడ్డేపల్లి మల్లేశం 9014206412 

----26....02....2025**********

ఇటీవలి కాలంలో పిల్లలు పాఠశాలకు వెళ్తున్న సందర్భంలో వీపుపై కనబడుతున్న పుస్తకాల మోత హమాలీల మో త లాగా అనిపిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. అంత పెద్ద సంచులను మోస్తూ నడుము వంకర పోగా ఎ ముకలు విరిగిపోతూ ఉంటే మెడ నొప్పులతో బాధపడుతున్న కూడా అయ్యో అనని తల్లిదండ్రులు ఈ తీ రు మారాలనె ఉపాధ్యాయులు, కఠిన చర్యలు తీసుకుంటాం అనే ప్రభుత్వాలు కనిపించకపోవడం శోచనీయం అంటే ప్రభుత్వాలు తల్లిదండ్రులు సమాజం కూడా కళ్ళుండి చూడలేని గుడ్డి వాళ్లతో సమానమే. ప్రభుత్వ నిబంధన ప్రకారం గా పిల్లల శరీరం బరువులో బడి సంచి బరువు 10% మించి ఉండకూడదని స్పష్టంగా చెబుతుంటే సంచి పెద్దదైతే పుస్తకాలు ఎక్కువ పెట్టవచ్చు తద్వారా ఎక్కువ చదవస్తుందని ఆశతో తల్లిదండ్రులు పిల్లలను పంపడా న్ని గమనించినప్పుడు విద్య వ్యాపారమైనదా లేదా సృజనాత్మకతవైపు ఉందా ఆలోచించవచ్చు. ఇక్కడ చట్టము ఉపాధ్యాయులు విద్యారంగ పరిస్థితులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమైనది కనుకనే ఈ దుర్వ్యవస్థ నిరంతరము కొనసాగుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో కొంత అటు ఇటుగా వ్యవహారం నడుస్తూ ఉంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం సంచి మో త ఆధారంగానే అతని చదువును తరగతిని ర్యాంకులను నిర్ధారించే పరిస్థితి ఉన్నది అంటే అతిషయోక్తి కాదు. జాతీయ విద్యా ప్రణాళిక 2005 మరియు స్కూల్ బ్యాగ్ 2020 విధానం ప్రకారం నెల కు ఒక్కసారైనా నో బ్యాగ్ డే అమలు కావలసిన అవసరం ఉన్నప్పటికీ ఆ విధానాన్ని అమలు చేయకపోవడం పైన విలేకరులు ప్రశ్నిస్తే ఇటీవలి కాలంలో అనేక జిల్లాల డిఇ వోలు నెలకొక్కసారైనా నో బ్యాగ్ డే అమలు చేస్తామని ప్రకటించడం కొంతవరకు అభినందనీయం.

       ఇటీవలి కాలంలో కొన్ని మార్పులు-

*************************

  సామాజిక స్పృహ గల ఉపాధ్యాయులు విద్యాధికారులు లేదా ఇతరులు ఉన్నచోట కొంత మార్పు అనివార్యమవుతున్నది. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండల కేంద్రంలో అక్కడ విద్యాధికారిగా పనిచేస్తున్న గౌరవ ప్రభాకర్ రావు గారు అన్ని పాఠశాలల్లో సంచుల బరువును తూ చే విధానాన్ని అమలు చేయడం ద్వారా నిబంధనల మేరకు కార్యాచరణకు సంబంధించి కొన్ని సూచనలు జారీ చేయడం,అవసరమైనవి మాత్రమే తీసుకొని వెళ్లడం రేపటి అవసరం కోసం ఉన్నప్పుడు స్కూల్లోనే భద్రపరచుకోవడం వంటి విషయాలను సూచించినట్లుగా తెలుస్తున్నది. ఆడుతూ పాడుతూ సృజనాత్మకత ఆధారంగా నిర్మాణాత్మకమైన కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా మూర్తిమత్వాన్ని పెంపొందించాలి కానీ పుస్తకాల బరువు మాత్రమే జ్ఞానాన్ని నైపుణ్యాలను వికసింప చేస్తుంది అనుకోవడం మూర్ఖత్వం అని అనేకమంది సామాన్య ప్రజలు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్న తరుణంలో పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఆయాసంగా నీరసంగా ఆవేదనతో రావడాన్ని గమనించినప్పుడు మనం నిజంగా విద్యార్థులను చిత్రవధకు గురి చేస్తున్నాము అంటే అవునా కాదా? ఇప్పటి తరానికి పోషకాహార లోపం వల్ల అంతంతమాత్రంగా ఉన్న ఆరోగ్యానికి తోడుగా మెడ, వెన్నెముక, భుజాలు, నడుము, పిక్కల నొప్పులతో సతమతమవుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు.దీనికి పుస్తకాల సంచి ప్రధాన కారణం కాదా ఇక అలాంటి పరిస్థితిలో పాఠశాలలో కానీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కానీ ఆడుకోవడానికి మనసు ఏ రకంగా సహకరిస్తుంది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సంచిలో ఉండే ఐటమ్స్ ను ఆలోచించినప్పుడు పాఠ్యపుస్తకాలు, హోంవర్క్, చిత్తూ కాఫీ, జీకే బుక్కు, కంప్యూటర్ పుస్తకాలు, ప్రతి సబ్జెక్టుకు రెండేసి నోటుబుక్కులు, ఇంకా ఉపాధ్యాయుల ఆలోచనను బట్టి అదనపు నోట్ బుక్కులు, భోజనం డబ్బా, నీళ్ల సీసా, కంపాస్ బాక్స్ తప్పనిసరి. వీటితో పాటు తరగతులను బట్టి పది నుండి 15 కిలోల వరకు మరికొన్ని చోట్ల 20 కిలోల వరకు ఉన్నాయన్న ఆశ్చర్యపోనాక్కర్లేదు. ఇదేనా మనం పాఠ్య బోధన ద్వారా విద్యారంగము ద్వారా ఆశిస్తున్నటువంటి భారత భవితవ్యం? బావి సవాళ్లను అధిగమించే శక్తివంతులను తయారు చేయాలి కానీ బరువులు మోసే వాళ్లుగా మారిస్తే ప్రయోజనం ఏమిటి? అనారోగ్య భారతాన్ని ఆవిష్కరించడం తప్ప.

      పుస్తకాల సంచి బరువు- ప్రభుత్వ ఉత్తర్వులు-కొన్ని నిర్మాణత్మక సూచనలు:-

****************************************

  సెంట్రల్ సిలబస్ను ఎన్సీఈఆర్టీ వాళ్లు నిర్ణయిస్తే రాష్ట్ర సిలబస్ను ఎస్సీఈఆర్టీ వాళ్లు నిర్ణ ఇస్తారు. ఎస్సీఈఆర్టీ వాళ్ల యొక్క ఆదేశాల ప్రకారంగా పుస్తకాల బరువు ఉండాల్సిన విధానం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల కంటే ముందుగానే 2018లో జీవో నెంబర్ 1 ద్వారా ఆయా తరగతుల పాఠ్యపుస్తకాల బరువును అమలు చేయాలని ఆదేశించినప్పటికీ అవి జీవోలకే పరిమితం కావడం ఆందోళన కలిగించే విషయం.

---1,2 తరగతుల వారికి 1.5 నుండి 2 కిలోల వరకు

 ---3 నుండి 5 తరగతుల వరకు 2.3 నుండి 3 కిలోల వరకు 

---6 నుండి 7 తరగతుల విద్యార్థులకు 4 కిలోలు 

----8వ తరగతికి 4.5 కిలోలు 

----9,10 తరగతి వాళ్లకు 5 కిలోల వరకు బరువు ఉండవచ్చునని ఆ ఉత్తర్వుల సారాంశం.

     కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 1 నుండి 5 తరగతి విద్యార్థులు మోస్తున్న బరువు 6 నుండి 12 కిలోల వరకు ఉన్నట్లుగా తెలుస్తున్నది. 6 నుండి 10తరగతి విద్యార్థులు సగటున 17 నుండి 20 కిలోల బరువులు మోయాల్సి వస్తున్నట్లుగా విద్యార్థుల తల్లిదండ్రుల అనుభవం పరిశీలన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వును పూర్తిగా పాఠశాలలు అందులో ప్రైవేటు పాఠశాలలు ఉల్లంఘిస్తుంటే చూస్తూ ఊరుకోవడం అంటే అంతకు మించిన బావ దారిద్రం మరొకటి ఉండదు.

         ప్రభుత్వ పాఠశాలల్లో సంచుల బరువును కుదించే నిర్ణయాన్ని అమలు చేయడంతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో నిర్ధాక్షిణ్యo గా ఆచరించడానికి సరైన ఆదేశాలు ఇవ్వాలి. మండల విద్యాధికారులు జిల్లా విద్యార్థులకు ప్రభుత్వం అల్టిమేటo ఇవ్వడం అవసరం. భావి భారత పౌరుల అనారోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు సమాజం ప్రభుత్వాలు అధికారులు పైన వచ్చిన ఉత్తర్వులు అమలు జరిగేలా చూడాలి. 20 కిలోల విద్యార్థి సంచి బరువు మూడు కిలోలు దాట కూడదు. 40 కిలోల విద్యార్థి సంచి బరువు 6 కిలోలు మించకూడదు. ఏ రోజు అవసరమైన పుస్తకాలు ఆరోజునే సర్ది పంపాలి. పుస్తకాల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయడం కుదించడం కూడా అవసరం. బహుళ అంతస్తులోని తరగతి గదులకు వెళ్లడం మరీ ప్రమాదకరంకనుక ప్రత్యేక ఏర్పాటు చేయాలి. శారీరకంగా మానసికంగా విసిగిపోతే చదువు పట్ల శ్రద్ధ చూపడం సాధ్యం కాదు అప్పుడు విద్యారంగ లక్ష్యాలే దెబ్బతింటాయి. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల పైన ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తప్పకుండా ఆమోదించే ప్రయత్నం జరగాలి. ఉల్లంఘించిన పాఠశాల పైన జరిమానా విధించాలి. " పాఠ్యపుస్తకాలు నోటుబుక్కులు బ్యాగులను పాఠశాలలు సమకూర్చే సంప్రదాయాన్ని బద్దలు కొట్టడం కూడా బరువును అరికట్టడానికి తోడ్పడుతుంది. మానసిక నిపుణులు విద్యావేత్తలు విశ్లేషకులు చిన్నారుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న సంచుల బరువును తగ్గించడానికి ఆరాటపడుతున్న విషయం అంతిమంగా పాలకులు గుర్తిస్తేనే పరిష్కారం దొరుకుతుంది. వాణిజ్య ధోరణితో కాకుండా సామాజిక ఆరోగ్య రీత్యా ఆలోచిస్తేనే పరిష్కారం సులభం. తక్షణమే ఉత్తర్వులు అమలులోనికి వచ్చేలా కార్యాచరణ ప్రకటించడం అవసరం.ఈ దుస్థితిని గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు మూడు పుస్తకాలు ఒకటి రెండు నోట్బుక్లతోనే విద్యార్థుల దినచర్య ముగిసేలాగా ప్రణాళిక చే సినట్లుగా తెలుస్తున్నది. కీలకమైన నాలుగు సబ్జెక్టులను ఒకే బుక్కుగా తయారు చేయడం ద్వారా ఈ చర్య తీసుకోనున్నట్లు పత్రికల ద్వారా తెలుస్తున్నది. ఆ విధానం అమలులోనికి వస్తే దాని మంచి చెడుల బేరీజు వేసుకొని మన ప్రభుత్వం కూడా ముందుకు పోవలసిన అవసరం ఉన్నది."

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333