పీఎస్బీ వినియోగం పై రైతులకు అవగాహన నర్సాపూర్
01 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– వరి నాట్లలో ఫాస్ఫేట్ సొల్యూబిలైసింగ్ బ్యాక్టీరియా వినియోగం పై మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని మూసాపేట్ గ్రామంలో మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ విద్యార్థులు రైతులకి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పీఎస్బీనీ వినియోగించే విదానాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రదర్శించి దాని ప్రయోజనాలను రైతులకు వివరించారు.నేలలో ఉన్న మొక్కలకు అందుబాటులో లేని ఫాస్పరస్ ను కరిగించి మొక్కలకు సులభంగా అందుబాటులోకి తీసుకోరావడంతో పీఎస్బీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ విద్యార్థులు,రైతులు పాల్గొన్నారు.