చర్ల,దుమ్ముగూడెం మండలాలకు 23 బోర్లు మంజూరు
బి ఆర్ ఎస్- ఎంపీ వద్దిరాజు నిధుల కేటాయింపు.
తెలంగాణ వార్త ఏప్రిల్, 22: జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : ఏజెన్సీ ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని గిరిజన గూడెల్లో నీటి ఎద్దడి సమస్యకు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పరిష్కారం చూపారు. తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడి గిరిజనులకు చేతిపంపుల ద్వారా మంచినీటిని అందజేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు చేసిన విజ్ఞప్తి మేరకు ఎంపీ రవిచంద్ర స్పందించి తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో రెండు మండలాల్లో 23 మంచినీటి బోర్లు మంజూరు చేశారు. వీటిలో దుమ్ముగూడెం లో 15, చర్లలో 8 బోర్లు ఉన్నాయి. ఈ మేరకు బోర్ల నిర్మాణానికి అయ్యే రూ.35 లక్షలు విడుదల చేశారు. ఎండాకాలం తీవ్రత దృష్ట్యా సత్వరమే బోర్ల నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు. తాము అడిగిన వెంటనే బోర్లు మంజూరుతో పాటు నిధులు విడుదల చేసినందుకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణలు సంబంధితమండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఎండ్