పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్వినిరెడ్డి రిజర్వాయర్లను పరిశీలన

పాలకుర్తి 07 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- పాలకుర్తి నియోజకవర్గం నవాబుపేట రిజర్వాయర్‌ను సందర్శించి,రిజర్వాయర్ నుండి పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల,పాలకుర్తి,మండలాలకు సంబంధించిన గ్రామాలకు సాగు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా, సింగరాజుపల్లి,పెద్దమడూరు, చిన్నమడూరు,మరియు ఫోరెల్ కెనాల్స్‌ను పరిశీలించరూ.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ..కెనాల్స్‌లో నిర్వహణ పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా రైతులకు సాగు నీరు సకాలంలో అందుతుందని,ఇది పంటల ఉత్పాదకతను పెంపొందించడంలో సహాయపడుతుందని తెలిపారు. అదనంగా,కెనాల్స్ నిర్వహణతో నీటి నష్టం తగ్గి,నీటి వనరుల సమర్థవంతమైన వినియోగం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని,ఈ చర్యలు ఆ దిశలో ముందడుగు అని వారు అన్నారు.అధికారులను సమర్థవంతంగా పనిచేయాలని,రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వారు ఆదేశించారు.రైతులు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని,వాటిని పరిష్కరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు,సీనియర్ నాయకులు, యూత్ నాయకులు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.