పరీక్ష ప్యాడ్ల పంపిణీ

తిరుమలగిరి 18 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం జలాల్ పురం గ్రామ ఉన్నత పాఠశాలలో సోమవారం నాడు నాన్న సేవా సమితి వ్యవస్థాపకులు వనగండ్ల సైదులు ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్లాడ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు వారు పరీక్షలు రాసేందుకు వీలుగా తాను నాన్న సేవా సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్లాడ్లను పంపిణీ చేశానని అన్నారు విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులై చదువు నేర్పిన గురువులతో పాటు కన్న తల్లిదండ్రుల పేరు నిలపాలని అలాగే పాఠశాలకు మండల స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆయన కోరారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి అశోక్, వెంకటేశ్వర్లు , దోంగరిరవీందర్, తండు మహేష్ మాజీ సర్పంచు లు దాచేపల్లి వెంకన్న కొమ్ము వెంకన్న మాజీ ఎంపిటిసి దుప్పిపెల్లి అబ్బాస్ పేరాల వెంకన్న, బెట్టెం రాజు మోరిగాడుదుల రవి తదితరులు పాల్గొన్నారు