నేలకొండపల్లిలో వేగంగా సెంట్రల్ లైటింగ్ పనులు""మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల

Sep 12, 2025 - 12:51
Sep 12, 2025 - 15:42
 0  1
నేలకొండపల్లిలో వేగంగా సెంట్రల్ లైటింగ్ పనులు""మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల

 నేలకొండపల్లి లో వేగంగా సెంట్రల్ లైటింగ్ పనులు

 తెలంగాణ వార్త ప్రతిదీ రా వెళ్ళ: మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాలతో పనులు పార్రంభం నేలకొండపల్లి పట్టణ ప్రజల కల నెరవేరింది.గత కొంతకాలంగా సెంట్రల్ లైటింగ్ కోసం ఎదురు చూస్తున్న వారి కళ్ళలో రెవిన్యూ,గృహ నిర్మాణం,సమాచార శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆనందం నింపారు.ఇటీవల కూసుమంచి లోని మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు,మాజీ మార్కెట్ చైర్మన్ శాఖమూరి రమేష్, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొడాలి గోవింద రావు మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కలిసి ఆయన దృష్టికి సెంట్రల్ లైటింగ్ విషయం తీసుకెళ్లారు.స్పందించిన మంత్రి వర్యులు వెంటనే పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.దీంతో అధికారులు పనులు ప్రారంభించారు.సెంట్రల్ లైటింగ్ పనులను మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు,మాజీ మార్కెట్ చైర్మన్ శాఖమూరి రమేష్, నాయకులు కొడాలి గోవిందరావు పరిశీలించారు.అతి కొద్ది రోజులలోనే సెంట్రల్ లైటింగ్ తో నేలకొండపల్లి పట్టణం వెలుగులు విరజిమ్మనుంది*.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State