**నేలకొండపల్లి"రాయి గూడెం లో టిఆర్ఎస్ గల్లంతు"తంబూరు దయాకర్ రెడ్డి*

Sep 7, 2025 - 20:03
 0  4
**నేలకొండపల్లి"రాయి గూడెం లో టిఆర్ఎస్ గల్లంతు"తంబూరు దయాకర్ రెడ్డి*

*రాయిగూడెంలో బీఆర్‌ఎస్ గల్లంతు*

- *పదిరోజుల్లో మూడోసారి కాంగ్రెస్ గూటికి చేరికలు*

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ**తుంబూరు దయాకర్ రెడ్డి సమక్షంలో 50 కుటుంబాలకు కండువా*

ఖమ్మం : నేలకొండపల్లి మండలంలోని రాయిగూడెం గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. పదిరోజుల వ్యవధిలో మూడోసారి వరుసగా పెద్ద ఎత్తున చేరికలు జరగడంతో గ్రామంలో బీఆర్‌ఎస్ ప్రభావం గల్లంతైపోయింది.

ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీపీ కొర్లకుంట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి చేరుతున్న వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పార్టీలో చేరటం విశేషం. దీంతో ఆ గ్రామంలో బీఆర్‌ఎస్‌కి జాడ మిగల్లేదని నేతలు వ్యాఖ్యానించారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవ్వడానికి ప్రధాన కారణమని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తామని దయాకర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, నాయకులు కొడాలి గోవిందరావు, కోసూరి పానకాలు, కుక్కల హనుమంతరావు, ఎనికే జానకిరామయ్య, కోసూరి రాజాబాబు, లక్క రాముడు, వెన్నబోయిన కమలాకర్, ఇరగదిండ్ల నాగరాజు, కోసూరి రమేష్, యడవల్లి సైదులు, వెన్నబోయిన ప్రసాద్, కోసూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State