నూతన సమీకృత కలెక్టరేట్‌కు జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం తరలింపు
నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచే శాఖ కార్యకలాపాలు
గ్రౌండ్ ఫ్లోర్‌లోని జీ–20 గదిలో కార్యాలయం ఏర్పాటు
డి పి ఆర్ వో రఫిక్
ములుగు జిల్లా, ఆగస్టు 28 : ములుగు పాత కలెక్టరేట్‌లో ఇప్పటివరకు కొనసాగుతున్న జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని నూతనంగా ప్రారంభించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోకి తరలించినట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి ఎం.డి. రఫీక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న జీ–20 గదిని జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ కేటాయించినట్లు పేర్కొన్నారు.ఇకపై జిల్లా పౌర సంబంధాల శాఖకు సంబంధించిన అన్ని కార్యాలయ కార్యకలాపాలు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నుంచే కొనసాగుతాయని తెలిపారు. జిల్లా పౌర సంబంధాల శాఖకు సంబంధించిన అధికారిక సమాచార వ్యవహారాలు మీడియా సమన్వయం ఇతర కార్యాలయ కార్యకలాపాలు ఇకపై నూతన ఐడీఓసీ నుంచే నిర్వహించనున్నట్లు డీపీఆర్ఓ ఆ ప్రకటనలో వెల్లడించారు.