నిర్మల్: కవల పెళ్లికొడుకులు.. కవల పెళ్లి కూతుర్లు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన కవల సోదరులు తరుణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డికు, నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం టెంబుర్ని గ్రామానికి చెందిన కవల సోదరీమణులు స్పందన, స్ఫూర్తిలతో వివాహం జరిగింది. గురువారం నిర్మల్లో ఒకే వేదికపై జరిగిన ఈ అరుదైన 'క్వాడ్రఫుల్ వెడ్డింగ్' (కవలల-కవలల వివాహం) అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.