నిరాడంబరుడు ఆదర్శవాది కామ్రేడ్ సుందరయ్య. CPM 

May 21, 2026 - 20:00
 0  2

 జోగులాంబ గద్వాల 21 మే 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల. నిరాడంబరుడు ఆదర్శవాది కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యను ఆదర్శంగా తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు  సంఘటీత పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం పుచ్చలపల్లి సుందరయ్య 41 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు


      ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పార్లమెంటు లో తొలి ప్రతిపక్ష నేత. నిరాడంబరుడు ఆదర్శవాది కామ్రేడ్ సుందరయ్య స్పూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలనారు . నాడు సుందరయ్య గారు ప్రజా ధనం వృదా కాకుండా పార్లమెంటు కు సైకిల్ పై వెళ్ళి తన నిరాడంబరతను చాటారన్నారు.ప్రజాప్రతినిధులు సొంత ఆస్తిని రెట్టింపు చేసుకొనే నేటి కాలంలో, ఆనాడే తన యావదాస్తిని పేదలకు పంచి పెట్టిన ఆదర్శవాది కామ్రేడ్ సుందరయ్య అని కొనియాడారు.కేంద్ర ప్రభుత్వం సమస్యకు అసలు కారణం చెప్పకుండా ప్రజలను ఆర్థిక సంక్షోభాలకు సిద్ధంగా ఉండమని చెప్పడం విడ్డూరమన్నారు.చాలి చాలని ఆదాయలతో అత్తెసరు జీవితాలను గడుపుతున్న సామాన్య ప్రజలను పొదుపు చర్యలు పాటించాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. పాలకులకు నిజంగా పొదుపు మీద నమ్మకం ఉంటే కొద్దిమంది బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు చేస్తున్న విచ్చలవిడి ఖర్చులను ఎందుకు నిరోధించడం లేదని  ప్రశ్నించారు. పొదుపు పాలకుల కోసం కాకూడదని, పొదుపు ప్రకృతి కోసం కావాలని సుందరయ్య నుండి నేర్చుకోవాలని అన్నారు.దేశంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు కారణం అమెరికా సామ్రాజ్యవాద విధానాలే కారణమని కేంద్ర ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న చమురు సంక్షోభానికి కారణం దుబారా వలన ఏర్పడింది కాదని, దీనికి కారణం పశ్చిమ ఆసియా లో అమెరికా సామ్రాజ్యవాదులు ఇజ్రాయిల్ తో కలిసి ఇరాన్ పై చేస్తున్న దాడులు కారణం అన్నారు.నాడు కుల,మత ప్రాంతీయ విద్వేషాలకు వ్యతిరేకంగా సిద్ధాంతాలను పాటిస్తే, నేడు కులం మతం బందు ప్రీతితో ఆడపిల్లలపై అఘాయిత్యాలు సైతం వెనుక వేసుకొస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. సుందరయ్య స్పూర్తితో నేటి యువత సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ, నాయకులు తిరుపతన్న, లక్ష్మన్న,బాలకృష్ణ రామక్రిష్ణ రంగన్న రామాంజనేయులు,విష్ణు, కళ్యాణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333