దేశీ వంగడాలను కాపాడుకుందాం సేంద్రియ వ్యవసాయంతో

Jan 31, 2026 - 16:45
Jan 31, 2026 - 19:46
 0  20

తెలంగాణ వార్త సూర్యాపేట 31-01-26:

 దేశీ వంగడాలను కాపాడుకుందాం సేంద్రియ వ్యవసాయంతో భూమిని రక్షించుకుందామని కడ్తాల్ మండలం అన్మాసపల్లి ఎర్త్ సెంటర్ లో ఫిబ్రవరి 6 నుంచి 8 వ తారీకు వరకు

 తెలంగాణ ద్వితీయ విత్తన పండుగ కు జిల్లా నలుమూలల నుండి రైతులు, విద్యావంతులు, మేధావులు,విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాం రాష్ట్ర కో.ఆర్డినేటర్ యానాల వెంకటరెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహించే స్థానిక సంప్రదాయ విత్తనాలు దేశీయ వంగడాల సంరక్షణ ప్రదర్శన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. గత సంవత్సరం 2025 లో సిజిఆర్ ఆధ్వర్యంలో తొలి విత్తన పండుగను నిర్వహించినట్లు అది సత్ఫలితాలు ఇవ్వడంతో మళ్ళీ ఇప్పుడు నిర్వహణకు కార్యచరణ రూపొందించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా 75 పైగా స్టాలను మూడు రోజులపాటు ప్రదర్శన ఉంటుందని వివరించారు.

అంతరించిపోతున్న వ్యవసాయ పద్ధతులను విద్యార్థినీ విద్యార్థులకు మెలుకువలు నేర్పిస్తూ, వ్యవసాయాన్ని కాపాడుకోవడం ఎలా, వ్యవసాయం పద్ధతుల మీద ప్రతిరోజు రైతులకు సంబంధించిన ఒక అంశం మీద సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Santosh chakravarthy తెలంగాణ వార్త సీనియర్ జర్నలిస్టు 8500686136