దామరచర్ల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్
తెలంగాణ వార్త మిర్యాలగూడ దామరచర్ల మార్చి 11 : ఈరోజు దామరచర్ల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్లసమావేశంలో గాజుల శ్రీనివాస్ మాట్లాడుతూసామాన్య కాంగ్రెస్ కార్యకర్త నుండి ఎమ్మెల్సీ గా ఎదిగినటువంటికేతావత్ శంకర్ నాయక్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను గుర్తించి ఆయనప్రజలకు చేసినటువంటి సేవలను గుర్తించికేతావత్ శంకర్ నాయక్, కు ఎమ్మెల్సీగా కావడం వర్షం దగ్గర విషయమని అన్నారు ఎమ్మెల్సీ పదవికి సహకరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుందూరు జనా రెడ్డి , ఏఐసీసీ కమిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పిసిసి అధ్యక్షులుమహేష్ కుమార్ గౌడ్, నల్గొండ జిల్లామంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, మరియు నల్గొండ జిల్లా ఎంపీ కుందూరురఘువీరారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి , మరియు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే లందరికీ ధన్యవాదాలు తెలియజేశారుఅదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోఒక సామాన్య కార్యకర్తగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఒక గిరిజన ముద్దుబిడ్డ ఆపద ఉందని అర్ధరాత్రి తలుపు కొట్టిన ప్రతి పేదవాడికి తన వంతు సహాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా కంటికి రెప్పలా కాపాడుతూ తను చేసిన అనేక ప్రజా సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఒక గిరిజన బిడ్డకి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి చట్టసభల్లో అడుగుపెట్టే విధంగా కృషి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తుఅదేవిధంగా సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ తోనే_ సాధ్యం అనినాలుగు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తే నాలుగు ఎమ్మెల్సీలు కూడా బలహీన వర్గాలకే కేటాయించడం అది కాంగ్రెస్ పార్టీ యొక్క సోషల్ జస్టిస్ కి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఐక్యతతో ఉండి మన పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో గడపగడపకు తీసుకుని వెళ్లి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పి కొట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలుపు దిశగా కృషి చేయాలని కోరారుఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , శుభాకాంక్షలుతెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.