తల్లిపాల వార్షికోత్సవాలు.
జోగులాంబ గద్వాల 3 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల. సాతర్ల గ్రామపంచాయతీ వద్ద తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మండల సూపర్వైజర్ పరమేశ్వరి మాట్లాడుతూ....
బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించాలని తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి అమృతం వంటివని గర్భిణీ బాలింతలకు
తల్లిపాల ప్రాధాన్యతపై వివరిస్తూ తల్లి పాలన వలన బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అలాగే తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లులకు కలిగే లాభాలు, అలాగే బిడ్డకు కలిగే లాభాలను గర్భిణీ బాలింతలకు వాటి ప్రాధాన్యతపై వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మండల సూపర్వైజర్ పరమేశ్వరి, అంగనవాడి టీచర్ బీయ్యమ్మ, ఎఎన్ఎం పుష్ప, ఆశ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.