దానధర్మాలతో పాటు  క్షేత్రాల సందర్శన  కన్నా  తోటి ప్రాణుల పట్ల దయ కలిగి ఉండడం,  సాటి మనుషులుగా చూడడం  గొప్ప పని

Aug 3, 2026 - 02:03
Aug 3, 2026 - 02:13
 0  2
దానధర్మాలతో పాటు  క్షేత్రాల సందర్శన  కన్నా  తోటి ప్రాణుల పట్ల దయ కలిగి ఉండడం,  సాటి మనుషులుగా చూడడం  గొప్ప పని

దానధర్మాలతో పాటు  క్షేత్రాల సందర్శన  కన్నా  తోటి ప్రాణుల పట్ల దయ కలిగి ఉండడం,

 సాటి మనుషులుగా చూడడం  గొప్ప పని.  ఆ లక్ష్య సాధన వైపు  నడవాలి అంటాడు గురు నానక్.

కానీ ఎంత దుస్థితిలో  ఉన్నామో ఆలోచించండి.

----  వడ్డేపల్లి మల్లేశం

రాజకీయ సమస్యలు  ఆర్థిక సంక్షోభం  అసమానతలు అంతరాలు  ఈ దేశంలో తాండవిస్తున్న సంగతి మన అందరికీ తెలుసు  వాటి పరిణామం అంతా ఇంతా కాదు. కానీ  అమానవీయ పరిస్థితులు,  ఆదిపత్య భావజాలం,  మానవ సంబంధాల విధ్వంసం,  సాటి ప్రాణులు మానవుల పట్ల   అవమాన ధోరణి అంతకు మించిన స్థాయిలో సమాజాన్ని ప్రభావితం చేస్తూ సామాజిక జీవితాన్ని  బ్రష్టు పట్టిస్తున్నది.  దీనికంతటికీ కారణం  స్వార్థం కోరికలు,  తోటి మనిషిని సాటి మనిషిగా గుర్తించకపోవడం,  ప్రాణుల పట్ల  నిర్దయ, ఐహిక సుఖాల పట్ల  విపరీతమైన వాంఛ,  మనిషిని మనిషిగా జీవించడానికి  వీలుకాకుండా అడ్డుపడుతున్న కొన్ని అంశాలు  ప్రాణం ఉన్న మనుషులను పక్కనపెట్టి  ప్రాణం లేని రాళ్లు రప్పలు  గుట్టలు చెట్లకు  పూజలు చేస్తూ గౌరవిస్తూ వెలిగిస్తూ  అమానవీయంగా ప్రవర్తిస్తున్నటువంటి  నాగరికత ముసుగులో కొనసాగుతున్న  సమాజం  ఇది. మి o గ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు  కనీస అవసరాలను గుర్తించకుండా  తోటివాడికి పేదవాడికి అభాగ్యులకు  పిడికెడు అన్నం పెట్టడానికి నిరాకరించి  అద్దాల మేడలు రంగుల గోడలతో పాటు  తీర్థయాత్రలు  దానధర్మాల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి  మానవత్వం లేని మనుషులు ఉన్న సమాజం ఇది. వీళ్లకు ఆకలి అయ్యే మనుషులు కనిపించరు,  పేదరికo  నిరుద్యోగము ఆకలి చావులు  ఆత్మహత్యల ఘోస వినబడదు.
మనిషి కేంద్రంగానే కదా సమాజాన్ని వ్యవస్థను నిర్వచించేది. నిర్వచనం వరకు మాత్రమే  పరిమితం చేసి  సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్న కొందరి  ధన దాహానికి వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అవుతున్నది. ఆ ప్రవాహంలో పేదలు అభాగ్యులు అసహాయులు నిరక్షరాశులు  కొట్టుకొని పోతూ ఉంటే ఈ సమాజం  సమ సమాజం వైపు ఎలా పరిణామం చెందుతుంది ?.
ఎంత చదివినాము?  ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించినాము?  ఎంతమంది మిత్రులను సంపాదించుకున్నాము? అనేది ప్రాధాన్యత కాదు  ఏ మేరకు ఈ వ్యవస్థకు  మానవ మనుగడకు    పే ద సాధలకు తోడ్పడుతూ  సమాజంలో ఉ ణికలో ఉన్న మా? లేదా? అ నేదే సమస్య. ఉనికిలో లేకుండా  జనాభాలో మాత్రం  భాగస్వామ్యం అయితే ప్రయోజనం ఏముంది?  స్వార్థం గూడు కట్టుకున్న ఈ కాలంలో  పక్క వాడి గురించి కూడా ఆలోచించే  ఓపిక లేకుండా ఉంటే,  పని మీద  మనసు లేకుండా  సంపాదన ధన దాహం  కుట్రలు కుతంత్రాల పైననే మనసు కేంద్రీకరిస్తే  తాత్కాలిక ప్రయోజనం ఉంటే ఉండవచ్చు కానీ శాశ్వతంగా  అభాస పాలవుతాo,  అగాధములోకి నెట్టి వేయబడతాo.  పలకరించడానికి కూడా తోడు లేనటువంటి దయనీయ పరిస్థితుల్లోకి  జారుకుంటాo సుమా!
      కుత్సిత మనస్తత్వానికి చరమగీతం పాడాలి
*************
  బాహ్య శక్తులు,  మీడియా ప్రభావం,  ఆకర్షణ పథకాలు,  ప్రభుత్వాల యొక్క అనాలోచిత చర్యలు అమలులో లేని కాలంలో  తోటి మనిషిని సాటి మనిషిగా ప్రేమించే  తత్వం బలంగా ఉండేది.  మనుషులకు ఎంత విలువ ఇచ్చేవారో అంతకు మించిన స్థాయిలో ఇతర జంతుజాలము  పక్షులు సాధు జంతువులకు కూడా అంతే గౌరవాన్ని ఆదరణను అందించేవారు. కానీ నేడు దానికి భిన్నంగా  ప్రాణం ఉన్న మనుషులను జంతువులను పశుపక్షాదులను పక్కనపెట్టి  అవసరమైతే అవమానించి  దూరంగా నెట్టివేసి
గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు  దానధర్మాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేటి కాలంలో  కొందరి మానవ జీవితానికి  సార్థకతగుర్తింపు లేదు డబ్బుతో కూడుకున్న జీవితం కావచ్చు కానీ. అందుకే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేటి మానవ జీవితాన్ని  పలు కోణాలలో పరిశీలించినటువంటి  సిక్కు మత స్థాపకులు గురునానక్  సున్నితంగా మనిషి యొక్క ఆలోచనలను కర్తవ్యాన్ని భావజాలాన్ని  పరిసరాలతో మనుషులతో ఇతర ప్రాణికోటితో సర్దుబాటయే క్రమాన్ని  సున్నితంగ హెచ్చరించినా  అది మనిషి  అహంకారానికి తీరని  శిక్షగా కనిపిస్తుంది. ఆలోచించే కోణాన్ని బట్టి,  స్పందించే మనస్తత్వాన్ని బట్టి,  బాధ్యతను గుర్తించే భావోద్వేగాన్ని బట్టి  మనుషుల యొక్క ధర్మాలను గుణగణాలను నిర్దేశించడం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కానీ  తోటి ప్రాణులతో దయగా  మసలకుండా  సంపాదించిన కోట్ల ధనాన్ని గుర్తింపు కోసం  క్షేత్రాలకు తీర్థయాత్రలకు  అంతకుమించిన పెద్ద మొత్తంలో దానధర్మాలకు ఖర్చు చేస్తూ  తోటి ప్రాణుల పట్ల అమానవీయంగా ప్రవర్తించే  మనిషి తత్వాన్ని  సూటిగా ప్రశ్నించిన తీరు  ఆత్మ పరిశీలన యొక్క ఆవశ్యకతను మరింతగా  హెచ్చరిస్తున్నది.  మతం దైవం  ఆధ్యాత్మిక భావన పేరుతో చేస్తున్న ఖర్చు, ప్రయాణిస్తున్న తీర్థయాత్రలు,  వ్యవహరిస్తున్న
తీరు దానదర్మాలు వ్యక్తిగతం. అంత  కంటే కూడా  తోటి మనిషిని సాటి మనిషిగా చూసే   గుణం ప్రామాణికమని  అది లేని జీవితం ఎంత  ఖర్చుతో కూడుకున్నది అయినా  పరిగణించడానికి వీలు లేనిదని దీని అర్థం. రామాయణము, మహాభారతము, ఇతిహాసాలు పురాణాలు, మారిక్షిజం, లేని నిజo, మావో ఆలోచన విధానం  సోషలిజం  ఇన్ని న్ని విభాగాలలో కూడా  మనిషిని ప్రక్కన పెట్టి  ఇతరాలకు  ప్రాధాన్యతనిచ్చిన సందర్భం ఎక్కడా లేదు.  అలాంటప్పుడు  "వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం పబ్లిక్ లో  నిలబడితే ఏమైనా అంటాం అన్న ప్రముఖ విప్లవ రచయిత శ్రీ శ్రీ ఆలోచన ప్రకారం  వ్యక్తిగతమైన జీవితం   కొంత స్వేచ్ఛయుతమైనప్పటికి   సమాజంలో  వ్యవహరిస్తున్న తీరు, తోటి వ్యవస్థ పట్ల  నడక,  ఇచ్చిపుచ్చుకునే ధోరణి,మానవ సంబంధాలే  కొ లమానాలుగా ప్రాతిపదికగా సమాజం  నిర్వచించబడినప్పుడు  వీటికి దూరంగా ఉన్న  మానవ ఆలోచన సరళి, ఆడంబరం, అహంభావం,  ఆదిపత్యం, డబ్బున్నదనే అహంకారం, తుడిచిపెట్టుకుపోవాల్సిందే" .ప్రతి మతం నిర్వచించే  లక్ష్యం, హెచ్చరించే కర్తవ్యం, మానవ ధర్మాన్ని సమానత్వాన్ని  మానవీయ విలువలను  ప్రతిక్షేపించడమే. అలాంటప్పుడు ఏ మతం విలాసాలకు ప్రాధాన్యత ఇచ్చి  తోటి మనిషికి మాత్రం పిడికెడు కూడు  నిరాకరించమని
చెప్పిందో ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించుకొని,  పొరపాటున సవరించుకొని  తప్పిదాల పట్ల  క్షమాగుణాన్ని ప్రదర్శించాలి.
      ""మనిషిలో గూడు కట్టుకున్న స్వార్థపు  పొరలు,  గుడ్డి ఆలోచనలు,  కుట్రలు కుతంత్రాలు, అసూయ ద్వేషాలను  శుద్ధి చేసుకునే క్రమమే  విద్యార్జన  విజ్ఞాన సముపా ర్జున. తోటి ప్రాణుల పట్ల కరుణ  కలిగి  అవమానించకుండా చూడగలిగే మనస్తత్వాన్ని పెంపొందించుకుంటే  అంతకుమించిన తత్వశాస్త్రం,  ఆదర్శం,  దైవభక్తి, దేశభక్తి అంటూ మరొకటి ఉండదు.  అది మనిషిని మనిషిగా చూడడం,  మనిషిని   సమున్నత స్థానంలో నిలబెట్టడం,మనిషికి మానవీయ కోణంలో కొత్త నిర్వచనాన్ని ఆపాదించడం, మనిషి గమ్యాన్ని, గమనాన్ని మరింత విస్తరించడం వంటి రూపాలలో బహిర్గతపరచడమే మానవ ఉనికికి కొలమానాలుగా నిర్దేశించ బడతాయి.మనిషిని మహోన్నతునిగా నిలబెట్టి సృష్టి రహస్యాలను విప్పి చెప్పి తనను తాను తెలుసుకోనెలా చేసేదే  విద్య.సమగ్ర జీవిత కోణంలో పెడదారి పట్టి, తప్పుదారిలో పయనించి,  విద్యకు ద్రోహం  చేసే అధికారం ఎవరికి లేదని గుర్తించడమే  గురునానక్
సూచనకు  అంతరార్థం.  
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333